M4M మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టైపై మోహన్ వడ్లపట్ల ప్ర‌శంస‌లు !

IMG 20240821 WA0186 e1724238027524

  మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెష‌ల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల.

వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌న్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చూసి ఉండ‌ర‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించినందుకు రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఈ సినిమా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని బాగా న‌చ్చుతుంద‌ని తెలిపారు.

తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం.. ఇలా ఐదు భాషలలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్‌కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది. ప్ర‌స్తుతం వసంత్ ఇసైపెట్టై నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది.

IMG 20240821 WA0185

షూటింగ్ పూర్తి చేసుకున్న M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’) ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఒడిశా సూపర్ స్టార్ సంభీత్ ఆచార్య, అమెరికన్ యాక్ట్రస్ జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.

నటి నటులు:

జో శర్మ (USA), సంబీత్ ఆచార్య

సాంకేతిక బృందం:

బ్యానర్ : మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్, కథ : మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల, దర్శకత్వం : మోహన్ వడ్లపట్ల, సంగీతం : వసంత్ ఇసైపెట్టై, కెమెరామెన్ : సంతోష్, ఎడిటింగ్ : పవన్ ఆనంద్, పీఆర్వో : పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *