Lyrical Song Launch:  “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ విడుదల!

raju gaari ammayi naidu gaari abbayi e1693322851831

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు.

యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ విడుదలైంది.

raju gaari ammayi 4

ఈ పాట మధురమైన సంగీతం, చక్కని సాహిత్యంతో హృదయాలను ఆకర్షిస్తుంది. రెహమాన్ రచించిన ఈ చిత్ర గీతాన్ని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం.

“ఐ లవ్ యు” అనే పాట చిత్ర బృందం యొక్క అంకితభావం మరియు కృషికి నిదర్శనం. చిత్ర నాయికా నాయకులపై చిత్రీకరించ బడ్డ ఈ గీతం యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

raju gaari ammayi

రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ఈ పాట విడుదలకు ముందే విడుదల అయిన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టీజర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ మవుతోంది.

తారాగణం:
కథానాయకుడు: రవితేజ నున్నా
కథానాయిక: నేహా జురెల్
ఇతర ప్రధాన పాత్రలలో నాగినీడు,ప్రమోదిని
జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి
యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర
గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు
శ్రావణి

సాంకేతిక బృందం:
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ
కూర్పు: కిషోర్ టి
దర్శకత్వం: సత్య రాజ్
నిర్మాతలు: రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *