LYF : సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్న మూవీ టీం!

IMG 20250406 WA0261 scaled e1743942197803

తాజాగా విడుదలైన “LYF – Love Your Father” చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలకి ముందే ట్రైలర్ తో ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ తో జనాల్లోకి బాగా వెళ్ళింది. రిలీజ్ అయ్యాక కూడా జనాల అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది.

ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించారు. SPB చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి.

IMG 20250405 WA0143

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు మూవీ టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగా హీరో హర్ష మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా సినిమా చూడని వారుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు.

ఇక డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..” సినిమా చాలా బాగుందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంత చిన్న సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి తమకు ఈ సినిమా చూశాక వాళ్ళ తండ్రి గుర్తొస్తున్నారు అని చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. ” అని అన్నారు.

IMG 20250406 WA0259

ఇక నిర్మాత కిషోర్ రాఠి మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుందని చూసినవారు అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో గత నలభై ఏళ్లుగా ఇలాంటి కుటుంబ కథ చిత్రాలే తీస్తున్నాం. వాటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణలు పొందాయి. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. అందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇంతమంచి సినిమా తీసినందుకు డైరెక్టర్ పవన్ గారికి కూడా నా ధన్యవాదాలు” అని అన్నారు.

ఇక సహనటుడు బంటి మాట్లాడుతూ.. ” ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్.. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మా లాంటి కొత్త యాక్టర్స్ ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను ” అని అన్నారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్

నటీనటులు :

శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు , డైలాగ్స్ : నాగ మాధురి , సంగీత దర్శకుడు : మణిశర్మ , బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ , నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి. , ఆర్ట్: శంకర్ చిడిపల్లి ,కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి , కాస్ట్యూమర్ : రాంబాబు , కొరియోగ్రఫీ : మొయిన్ , ఎడిటర్ : రామకృష్ణ , డిఓపి : శ్యామ్ కే నాయుడు, PRO : మధు విఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *