“LYF (లవ్ యువర్ ఫాదర్)” మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ,
18F రేటింగ్: 3 / 5 ,
విడుదల తేదీ: ఏప్రిల్ 4, 2025 ,
తారాగణం: ఎస్.పి. చరణ్, శ్రీహర్ష, కాశికా కపూర్, ప్రవీణ్, భద్రం
దర్శకుడు: పవన్ కేతరాజు
నిర్మాతలు: కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి (మనీషా ఆర్ట్స్ & అన్నపరెడ్డి స్టూడియోస్)
సంగీతం: మణిశర్మ ,
కథ – స్క్రీన్‌ప్లే :
“LYF” ఒక తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని ఆధారంగా చేసుకున్న ఎమోషనల్ డ్రామా. సినిమా కాశి (వారణాసి) ఘాట్‌లో ఆకట్టుకునే ఓపెనింగ్‌తో ప్రారంభమై, ఒక సంగీత ప్రియుడైన తండ్రి (ఎస్.పి. చరణ్) మరియు అతని కొడుకు (శ్రీహర్ష) మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణాన్ని చూపిస్తుంది.
ఒక ఊహించని సంఘటన వీరి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది, కానీ ఇంటర్వెల్‌లో వచ్చే మంచి ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో కథ వేగం పుంజుకుని, క్లైమాక్స్‌లో బలమైన ఎమోషనల్ ఇంపాక్ట్‌తో ముగుస్తుంది.
దర్శకుడు – నటీనటుల ప్రతిభ:
పవన్ కేతరాజు ఈ కథను సహజంగా, హృదయానికి హత్తుకునే విధంగా తెరకెక్కించాడు.
ఎస్.పి. చరణ్ తన తండ్రి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం లెగసీని ప్రతిబింబిస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు
ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని నటన గుండెల్ని పిండేస్తుంది.
హీరో గా శ్రీహర్ష తన నటన లో యువత ఆవేశాన్ని, బాధను బాగా పండించాడు. తనకు ఇది మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న నటుడు బాగా చేశాడు.
నటుడు ప్రవీణ్ కి మొదటసారి ఫుల్ లెన్త్ పాత్ర దొరికింది. తన నటనతో నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కంట తడి పెట్టించాడు.
కాశికా కపూర్, భద్రం సపోర్టింగ్ రోల్స్‌లో సమర్థవంతంగా నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ:
మణిశర్మ సంగీతం సినిమాకి ప్రాణం. బ్యాక్‌గ్రౌండ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్‌కి బలం చేకూర్చింది, ముఖ్యంగా వారణాసి ఘాట్ సీన్స్‌లో స్కోర్ ఆకట్టుకుంటుంది.
DoP రవి కుమార్ సినిమాటోగ్రఫీ వారణాసి, గోవా, మల్లారెడ్డి కాలేజీ వంటి అద్భుత లొకేషన్స్‌ని అందంగా చిత్రీకరించింది.
ఎడిటింగ్ కొన్ని చోట్ల మరింత టైట్‌గా ఉండొచ్చు, కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా కట్ చేశారు.
నిర్మాత కిషోర్ రాఠీ & మనీషా ఆర్ట్స్ గత చిత్రాలు:
నిర్మాత కిషోర్ రాఠీ మనీషా ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. 1990లలో ఎస్.వి. కృష్ణారెడ్డితో కలిసి “యమలీల”, “మాయలోడు”, “ఘటోత్కచుడు”, “గన్‌షాట్”, “వినోదం”, “ఉగాది”, “దీర్ఘ సుమంగళి భవ”, “అభిషేకం” వంటి హిట్ చిత్రాలను నిర్మించారు.
ఈ సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు కొత్త ఒరవడిని సృష్టించాయి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో “LYF”తో రీ-ఎంట్రీ ఇస్తున్న కిషోర్ రాఠీ, ఖర్చుకు రాజీపడకుండా వారణాసి, గోవా, మల్లారెడ్డి కాలేజీ వంటి అద్భుత లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపి, తన బ్యానర్ లక్ నీ వెండితెర మ్యాజిక్ నీ మరలా చూపించేందుకు సిద్ధమయ్యారు.
LYF పాజిటివ్ అంశాలు:
© కాశి ఘాట్‌లో స్టార్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, మరియు క్లైమాక్స్ ఎమోషనల్ హైలైట్స్ ఆకట్టుకున్నాయి.
© ఎస్.పి. చరణ్, శ్రీహర్ష మధ్య కెమిస్ట్రీ అద్భుతం.
© మణిశర్మ సంగీతం మరియు విజువల్స్ సినిమాకి ఆత్మగా నిలిచాయి.
LYF లో నెగిటివ్ అంశాలు:
© ఫస్ట్ హాఫ్‌లో పేస్ కొంత నెమ్మదిగా ఉంది.
© కొన్ని డ్రామా సీన్స్ ఓవర్‌గా అనిపిస్తాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
“LYF” తండ్రి-కొడుకు బంధాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ హృదయాన్ని తాకే కథ. కిషోర్ రాఠీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా తన నిర్మాణ నైపుణ్యాన్ని చాటుతూ, ఖర్చుకు రాజీపడకుండా అద్భుత లొకేషన్స్‌లో ఈ సినిమాను రూపొందించారు.
ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఇది ఒక ట్రీట్, సెకండ్ హాఫ్ మిమ్మల్ని కన్నీళ్లలో ముంచెత్తుతుంది.
పంచ్ లైన్:
“తండ్రి ఒక దేవుడు కాదు, కానీ దేవుడిలా ప్రేమిస్తాడు!”
* కృష్ణ ప్రగడ.