గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరించారు.
గతేడాది అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఇదే సూపర్ హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
“లవ్ రెడ్డి” సినిమా అమోజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. తమ సినిమా ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో ద్వారా మరింతగా రీచ్ కావడం పట్ల మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆహా ఓటీటీలోనూ “లవ్ రెడ్డి” సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
నటీనటులు :
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్:
సంగీతం – ప్రిన్స్ హేన్రి, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవీంద్ర రెడ్డి, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), సహా నిర్మాతలు – సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా, నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి, రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి.