Love Me Movie Review & Rating: డేర్ చేసే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇరికా !

Love me movie Review by 18fms 1 e1716741451635

చిత్రం: లవ్ మి-If  You Dare !

విడుదల తేదీ : మే 25, 2024,

నటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు..,

దర్శకుడు: అరుణ్ భీమవరపు,

నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డి,

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి,

సినిమాటోగ్రఫీ: పి సి శ్రీరామ్,

ఎడిటింగ్: సంతోష్ కామిరెడ్డి.

Love me movie Review by 18fms 7

మూవీ: లవ్ మి రివ్యూ  (Love Me Movie Review) 

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ఆశీష్ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా డెబ్యూ  దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన వినూత్న హారర్ ఎమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ  “లవ్ మీ” ఇఫ్ యు డేర్ .

ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో పాటు బేబీ ఫేమ్ వైష్ణవి, రౌడీ బాయ్స్ తర్వాత ఆశిష్ కి,  అలాగే బలగం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ కి రెండవ సినిమా అవ్వడం వలన, టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం తో ప్రేక్షకులలో ఆసక్తి  అమాంతం పెంచేసింది.

ప్రతి సినీ ప్రేక్షకుడు డేర్ చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత ఈ లవ్ మి  చిత్రం ఈ శనివారం దియేటర్స్ లోకి వచ్చింది. మరి ఎంత వరకూ ప్రేక్షకులను, క్రిటిక్స్ ని మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

Love me movie Review by 18fms 4

కధ పరిశీలిస్తే (Story Line): 

రామచంద్రపురం అనే ఊరిలో కొత్తగా పెళ్లి అయిన జంట ఓ బంగ్లా లో దిగుతారు. కానీ ఆ బంగ్లా లోకి వచ్చిన  ఆ నవ వధువు గత ఆరేళ్ళు లొ ఆ ఇంటి గేట్ కూడా దాటి బయటకి వచ్చింది ఉండదు, ఆమెని ఆ ఊరి జనాలు ఏవరూ చూసింది  ఉండదు. కానీ ప్రతి రాత్రి 8 నుండి 9 వరకూ ఊరి జనాలకు ఏడుపులు  ఇనిపిస్తూ ఉంటాయి. ఆరు సంవత్సరాలు తర్వాత ఓ రాత్రి ఆమె అగ్నికి ఆహుతి అవుతూ  మరణిస్తుంది.

ఇక మరోపక్క ప్రకృతి ని ఆశ్వాదిస్తూ  దయ్యాల కధలతో అడ్వెంచర్స్ చేసే అర్జున్ (ఆశిష్) అలాగే తన అన్నయ్య ప్రతాప్ (రవి కృష్ణ) తో కలిసి యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతాప్ క్లాస్ మెట్ ప్రియా (వైష్ణవి చైతన్య) ద్వారా ఆంధ్ర – కర్ణాటక బోర్డర్ లో పాడుబడ్డ అపార్ట్మెంట్ లో దివ్యవతి అనే దయ్యం కథ తెలుస్తుంది. ఈ కధ విన్న అర్జున్ అసలు దయ్యల సంగతి, దివ్యవతి సంగతి ఏంటో చూసి తెలుసుకోవాలని ఆ అపార్ట్మెంట్ ఒంటరిగా వెళ్తాడు.

 అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి తో ఎందుకు ప్రేమలో పడతాడు?

అపార్ట్మెంట్ లో ఉన్న ముఖం కనిపించని దెయ్యం అర్జున్ ప్రేమను ఒప్పుకుందా ?

అర్జున్ ప్రేమ నిజమైనదా లేక వీడియొ కోసం నటిస్తున్నాడా ?

దివ్యవతి అసలు కధ ఏమిటి ? ఆమె నిజంగా అందరినీ చంపేస్తుందా?

అసలు ఈ దివ్యవతి ఎవరు? తన రూపాన్ని చూసిన వారు అందరు ఎందుకు చనిపోతున్నారు?

ప్రియకు – ప్రతాప్ కి ఉన్న సంభందం ఏమిటి ? ,

ప్రియకు – అర్జున్ కి మధ్య రిలేసన్ ఏమిటి ? ,

 బ్లాక్ డ్రస్ వేసుకొంటూ, చెప్పులు లేకుండా అర్జున్ ఎందుకు కనిపిస్తున్నాడు ?,

అర్జున్ గతం ఎమిటి ? 

వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ ని క్రియేట్ చేసి జవాబులు తెలుసుకోవాలి అనిపిస్తే వెంటనే మి దగ్గరలోని దియేటర్ కి వెళ్ళి లవ్ మి ఇఫ్ యు డేర్ సినిమా చూసేయవలసిందే !

Love me movie Review by 18fms 2

కధనం పరిశీలిస్తే (Screen – Play):

లవ్ మి  If You Dare చిత్రంకధనం చూస్తే మొదటి అంకం (ఫస్టాఫ్) డీసెంట్ గా ఆకట్టుకునేలా స్లో గా  సాగుతుంది కానీ రెండవ అంకం (సెకండాఫ్) లో అసలు కధా వేగం మొదలవుతుంది. ఒక స్లో స్టార్ట్ తో కధ మొదలై ఒకింత కన్ఫ్యూజన్ స్క్రీన్ రైటింగ్ తో సాగేలా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రియ (వైష్ణవి చైతన్య) పాత్రని మలిచిన విధానం సామాన్య వీక్షకులకు అర్దం అవ్వదు. పేపర్ మీద కధనం, పాత్ర స్వభావం బాగానే ఉన్నా, షార్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ లో మాత్రం లాజికల్ గా ఆకట్టుకునేలా ఉండదు.

ఒక సీన్ లో ఒకరితో ప్రేమలో, మరో సీన్ లో మరోకరితో  ప్రేమలో ఉన్నట్టు చూపించడం ఆడియన్స్ ని కన్ఫ్యూస్ చేయడమే. అలాగే ప్రియ పాత్ర ఫాస్ట్ ని మరిచిపోవడం కోసం వేరే వాళ్ళ పేరుని, గుర్తింపుని  వాడుకోవడం వంటివి నార్మల్ ప్రేక్షకులకు అర్దం కావు.

ఈ విధమైన కధనం తో దర్శకుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అది స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయలేక పోయాడు. అలాగే సినిమాలో పెద్దగా ఎంటర్టైన్మెంట్ కానీ సాలిడ్ ఎమోషనల్  సీన్స్ కానీ లేవు. ప్రి – క్లైమాక్స్ నుండి ప్రేక్షకులు కధనం తో ఇన్వాల్వ్ అయితే ఎమోషన్ గా ఫీల్ అవ్వగలరు.

అలాగే కొన్ని సీన్స్, పాత్రలు చూస్తున్నప్పుడు వచ్చే డవుట్స్ నిజం అయిపోతాయి.  ఆ విధంగా కధనం లొని కొన్ని అంశాలు వీక్షకుడి ఊహ కు అర్ధం అయ్యేలా ఉంటాయి. వీటితో కథనం ఒకింత ఓపెన్ గా ఉండి ఆడియెన్స్ కి  చికాకు తెప్పించవచ్చు. దర్శకుడు కధ యొక్క కధనాన్ని ఎమోషనల్ గా నడిపించాడు కానీ, ఎక్కడ హర్రర్ ఇంపాక్ట్ కనిపించదు, ఆడియన్స్ భయపడే షాట్స్ కూడా పెద్దగా లేవు.

జీరో ఎక్స్పెక్టేషన్స్ తో దియేటర్ కి వెళ్తే మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీ ని ఆస్వాదించవచ్చు.

విరూపాక్ష, మశూద సినిమాల లా హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నిరాశే.. !

IMG 20240526 WA0000

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు అరుణ్ భీమవరపు మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న కధ – కధనాలు రాసుకున్నాడు. దానికి అనుగుణంగా స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయడం లో సక్సెస్ కాలేకపోయాడు అనిపిస్తుంది. మెయిన్ గా తాను రాసుకున్న ఎమోషనల్ ప్రేమ కధ మెప్పిస్తుంది. కానీ ప్రేమ/హారర్ రెండు అంశాల్ని బ్యాలన్స్ చేయడంలో కొద్దిగా తడబడ్డాడా అనిపిస్తుంది.

వైష్ణవి చైతన్య పోసించిన మెయిన్ ఫిమేల్ లీడ్ అయిన ప్రియ పాత్ర చాలా వరకూ కన్వీన్స్  గా అనిపించదు. పేపర్ మీద పర్ఫెక్ట్ గా ఉన్నా ఆన్ స్క్రీన్ కి వచ్చేటప్పటికి చాలా ఫ్లాస్ కనిపిస్తాయి.   పెర్ఫామెన్స్ పరంగా వైష్ణవి చైతన్య వంద శాతం ఇచ్చింది కానీ, ఆమె పాత్ర తీర్చి దిద్దిన విధానం కన్ఫ్యూస్ గా ఉండి డిజప్పాయింట్ చేస్తుంది.

మొదటి భాగం అంటే లవ్ మి ఇఫ్ యు డేర్  లోనే దివ్యవతి పాత్రను తీసుకొనివచ్చి హారర్, థ్రిల్స్ డోస్ బాగా దట్టించి ఉంటే  ఆ మధ్య వచ్చిన విరూపాక్ష లా 100 కోట్ల సినిమా అయ్యేది.

 ఆశీష్ రెడ్డి నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. మొదటి సినిమా రౌడి బాయ్స్ కంటే చాలా సెటిల్డ్ గా మంచి ఎక్స్ ప్రెషన్స్, మంచి బాడీ లాంగ్వేజ్ తో పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంటాడు.

 వైష్ణవి చైతన్య మరోసారి తన సాలిడ్ పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. మెయిన్ గా క్లైమాక్స్ లో ఆమె హావభావాలు ఎమోషన్స్ బాగున్నాయి. ఇంకా వైష్ణవి చైతన్య పై ఉన్న ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి.

ఇక మెయిన్ లీడ్ తర్వాత సిమ్రాన్ చౌదరి తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇంకా రవి కృష్ణ కూడా బాగా చేసాడు. సినిమా మొత్తం కనిపిస్తూ హీరోయిన్ ఇష్ట పడే పాత్రలో రెండవ హీరో గా కూడా కనిపిస్తాడు.

అలాగే రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రలు పరిధిలో ఆకట్టుకుంటారు. సినిమాలో కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ లు, పాత్రలు కూడా కనిపిస్తాయి. వాటి గురించి ఇక్కడ రాస్తే ఫస్ట్ చూసే ప్రేక్షకులు థ్రిల్స్ మిస్ అవుతారు.  అలాగే ట్విస్ట్ లు, క్లైమాక్స్ ట్విస్ట్ తెలియకుండా చూస్తే నే బాగా ఫీల్ వస్తుంది.

Love me movie Review by 18fms 6 e1716741531965

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం, పాటలు బాగున్నాయి. మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నా విజువల్ గా అంత ఇంపాక్ట్ఫుల్ గా కనిపించలేదు. BGM ఒకే అనిపిస్తుంది  కానీ, ఎక్కువ భయపెట్టలేదు.

పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కధ కు తగ్గ మూడ్ అయితే ఇవ్వగలిగారు.

సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ ఒకే కానీ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది.

అవినాష్ కొలను అందించిన ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. కానీ అపార్ట్మెంట్ ని పిచ్చిమెక్కలు, పచ్చ గడ్డితో నింపడం కృత్రిమంగా అనిపిస్తుంది . ఇంకా ఆ ఫ్లాట్ లో హీరో ఉంటున్నా ఇంకా డస్ట్ తో చూపించడం కొంచెం అతిగా అనిపించింది.

నిర్మాతలు హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి సీన్ కి నిర్మాతలు పెట్టిన ఖర్చు, శ్రమ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

Love me movie Review by 18fms

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

“లవ్ మీ” – If You Dare !  సినిమా లో మొదటిగా చెప్పుకోవలసింది  ఆశిష్ నటన. ఆశిష్ నటనలో రౌడీ బాయ్స్ కంటే  మంచి పరిణితి కనిపిస్తుంది, అలాగే వైష్ణవి చైతన్య కూడా మెప్పిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకొన్న పాయింట్ ప్రేక్షకులకు ఎంటనే అర్దం కానీ ఫార్మెట్ లో ఉంది కానీ, మరి తీసేయ వలసిన సినిమా కాదు.

మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లో హిరోయిన్ కి పెద్దగా సీన్స్ లేకపోవడం మరియు వీక్ క్యారెక్టరైజేషన్, పుర్రెల తవ్వకం, వాటిని రిపేర్ చేసి ఒరిజినల్ లుక్ తీసుకురావడం అనే అంశాలు కృత్రిమంగా (సినిమాటిక్)  అనిపిస్తూ ,ఈ సినిమాని చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహ పరుస్తాయి.

మెయిన్ గా దర్శకుడు లవ్ లో ఉండే ఘాడ ఎమోషన్ తో  కధ – కధనం రాసుకొన్నా, ప్రమోషన్స్ లో  హారర్ సినిమా గా ప్రాజెక్టు చేయడం వలన, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన హర్రర్ కానీ భయపెట్టే థ్రిల్స్ కానీ ఈ పార్ట్ లో (లవ్ మి If You Dare) లేకపోవడం వలన  సినిమా లొని కోర్ పాయింట్ ని ప్రమోషన్స్ లో చెప్పలేకపోవడం అయితే కనిపిస్తుంది.

లవ్ మి – If You Dare !  లో ఉన్న హర్రర్ ఎలిమెంట్స్ తో  అయితే ఈ చిత్రం ఆడియన్స్ ని ఫుల్ గా సంతృప్తి పరచలేదు. దివ్యవతి పాత్రను కూడా ఈ ఫస్ట్ పార్ట్ లోనే పరిచయం చేసి ఉంటే హర్రర్ సినిమా అని వచ్చిన ప్రేక్షకులకు కొంత తృప్తి కలిగేది.

Love me movie Review by 18fms 8 e1716741711621

చివరి మాట: డేర్ చేస్తే  ప్రేమించొచ్చు !

18F RATING: 2.5  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *