Love Me Movie Release Date Locked Release On: ఆశిష్, వైష్ణవి చైతన్య ల న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘లవ్ మీ- ఇఫ్ యు డేర్’ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే !

Love Me Movie Release Date Locked Release On e1713949541103

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

Love Me Movie Release Date Locked Release On1

రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు.

ఈ లవ్ మి చిత్రం లో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించగా  స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *