Love Me Movie Release Date Locked: ఆశిష్, వైష్ణవి నటించిన హారర్ థ్రిల్లర్ ‘లవ్ మీ’ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే! 

IMG 20240324 WA0042 e1711271387693

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు.

‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

IMG 20240323 WA0196

లవ్ మీ- ఇఫ్ యు డేర్’ టీజర్‌ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని టీజర్ చూసిన వారందరూ అంటున్నారు.

బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ‘లవ్ మీ’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు.

IMG 20240324 WA0041

ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ టెక్నీషియన్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

నటీనటులు :

ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు..

సాంకేతిక బృందం:

బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి, దర్శకుడు : అరుణ్ భీమవరపు, కెమెరామెన్ : పీసీ శ్రీరామ్, సంగీతం : కీరవాణి, ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి, పీఆర్.ఒ : వంశీ కాకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *