Love Guru Movie Review & Rating: యువ భార్య భర్తల అందమైన అద్భుత ప్రేమకధ

Love Guru review by 18fms e1713070870286

చిత్రం: లవ్ గురు 

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

నటీనటులు: విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు

దర్శకుడు: వినాయక్ వైద్యనాథన్

నిర్మాత: మీరా విజయ్ ఆంటోని

సంగీత దర్శకుడు: భరత్ ధనశేఖర్

సినిమాటోగ్రఫీ: ఫరూక్ జే బాష

ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ

మూవీ: లవ్ గురు రివ్యూ  (Love Guru Movie Review) 

బిచ్చగాడు ఫేమ్ విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన తమిళ చిత్రం రోమియొ ని తెలుగు ప్రేక్షకుల కోసం  ‘లవ్‌ గురు’ గా విడుదల చేశారు. కాగా ఈ లవ్ గురు సినిమా ఈ శుక్రవారం విడుదల అయింది. మన తెలుగు ప్రేక్షకులను ఈ లవ్ గురు చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా  18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

Love Guru review by 18fms 1

కధ పరిశీలిస్తే (Story Line): 

అరవింద్ (విజయ్ ఆంటోని)మలేసియా లో కుటుంబం కోసం కష్ట పడుతూ సహజ ప్రేమకు దూరం అవుతాడు. ఇంకా పెళ్లి వయసు దాటిపోతుంది అని తన కుటుంబ సబ్యులు అందరు అంటుంటే, తనకు కాబోయే భార్యను ముందుగా ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవాలి అనికొని మలేషియా నుంచి ఇండియా వస్తాడు.

తన జీవితంలో కొన్ని సమస్యలు కారణంగా 35 ఏళ్లు వచ్చినా అరవింద్ పెళ్లికి మాత్రం దూరంగా ఉండిపోయాడు. ఐతే, ఈ 35 ఏళ్ల అరవింద్ తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి) ని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క లీలా మాత్రం తాను పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తుంటుంది.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో లీలా – అరవింద్‌ పెళ్లి జరుగుతుంది.

పెళ్లి తర్వాత లీలా – అరవింద్‌ జీవితాలు ఎలా మారాయి ?,

అసలు అరవింద్ తన జీవితంలో ఏం కోల్పోయాడు ?,

భార్య లీలను హీరోయిన్‌ గా చేసేందుకు అరవింద్ ఎలాంటి రిస్క్ చేశాడు ?,

చివరకు లీల పెద్ద హీరోయిన్ అయ్యిందా లేక తన భర్తకు చేరువైందా ?,

అరవింద్ కి చిన్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటి ?, అనే ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే వెంటనే మీ దగ్గరలోని సినిమా దియేటర్ కి వెళ్ళి ఈ లవ్ గురు సినిమా చూసేయండి. యంగ్ కపుల్ కి, ఫ్యామిలీ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

Love Guru review by 18fms 2

కధనం పరిశీలిస్తే (Screen – Play):

లవ్ గురు సినిమా కధ పాయింట్ వింటున్నా, చూస్తున్నా గతం లో హిందీ లో షారుక్ ఖాన్ నటించిన  ‘రబ్ దే బనా దియా జోడి’ అనే సినిమా కథ గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఆ సినిమా కి ఈ లవ్ గురూ సినిమా కి కామన్ పాయింట్ ఒకటే అయినా, ట్రీట్మెంట్ విశయం లో రెండు సినిమాలు వేరు వేరు.

ఈ లవ్ గురు కథలో సిస్టర్ సెంటిమెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ – కథానాలు (స్క్రీన్ – ప్లే ) మాత్రం రెగ్యులర్ సినిమా గానే సాగింది. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో విశయం ఉన్నపటికీ, ఆ పాయింట్ కి తగ్గట్టు కధనం (స్క్రీన్ ప్లే) రాసుకోవడంలో దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ కొన్ని చోట్ల తడబడ్డాడు అనిపిస్తుంది.

అసలు ఇలాంటి కధ వస్తువు తీసుకున్నప్పుడు ఆ కధకి తగ్గ కధనం విశయం లో సినిమా గా మలచడం లో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి ఎంటర్ టైనర్ గా కధనం నడపాలి. కానీ, కొన్నిసీన్స్ లో మాత్రం అలా సాగలేదు.

అలాగే, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించినసీన్స్ లో కూడా సరైన ప్లే  లేదు. భార్య కోసం సినిమా ప్రొడ్యూస్ చేసే క్రమంలో వచ్చే సీన్స్ మాత్రం చాలా ఎంటర్ టైన్ గా కొత్తగా ఎవరు ఊహించని విధంగా ఉన్నాయి.

Love Guru review by 18fms 3

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ కి ఇది మొదటి సిన్మా అయినా ఇలాంటి కధ ని వ్రాసుకొన్నందుకు మెచ్చుకోవాలి.  చిన్నవయసులోనే వినాయక్ ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్న కధ రాసుకొన్నాడు. ముఖ్యంగా  ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరంగా పెడితే ఆ భర్త మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో భార్య ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ మధ్యలో సినిమా మేకింగ్ డ్రామాతో పాటు సిస్టర్ సెంటిమెంట్, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ తో లవ్ గురు అంటూ వినోదంతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో  ఆకట్టుకున్నాడు.

విజయ్ ఆంటోనీ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. తన రెగ్యులర్ నటన కి కొంచెం దూరంగా కామిడీ టైమింగ్ తో పాటు, డాన్స్ లతో మెప్పించాడు.  అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా విజయ్ ఆంటోనీ నటన బాగుంది.

హీరోయిన్ మీర్ణాళిని రవి కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొంచెం ఆరగెంట్ గా రఫ్ గా బాగా నటించింది. మీర్ణా కి ఈ లవ్ గురు మంచి సినిమా గా నిలిచిపోతుంది.

 సీనియర్ నటుడు వీటీవీ గణేష్ హీరోకి మామగా నటించి బాగా నవ్వులు పూయించాడు. వీటీవీ గణేష్ డైలాగ్స్ కొన్ని బాగా  కుదిరాయి. దియేటర్ లొని ఆడియన్స్ వీటీవీ గణేష్ కనిపించినప్పుడల్లా నవ్వుతూనే ఉన్నారు.

 యోగి బాబు పంచ్ లు మరియు కామెడీ టైమింగ్ కూడా బాగుంది. విజయ్ ఆంటోని – యోగీబాబు మద్య వచ్చే సీన్స్ కూడా సినిమా కి హై లైట్ అని చెప్పవచ్చు.

తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవిల తో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

ఇక ఈ సినిమాలో అరవింద్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన సిస్టర్ ట్రాక్.. హీరోయిన్ పాత్రతో ముడి పడిన సీన్స్.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

love guru Malesia trip

 

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

 భరత్ ధనశేఖర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సిస్టర్ సెంతమెంట్ పాట కూడా విజువల్స్ తో చాలా బాగుంది.

ఫరూక్ జే బాష సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. చాలా సీన్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ఎడిటర్ గా విజయ్ ఆంటోనీ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఐతే, కొన్ని స్లో సీన్స్ నిడివి తగ్గించి ఉంటే ఇంతే క్రిస్ప్ గా ఉండేది.

లవ్ గురు నిర్మాతగా విజయ్ ఆంటోనీ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తంగా చూసుకొంటే నటుడిగా, ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని రంగాలలోనూ విజయ్ ఆంటోని చాలా ఇన్వాల్వ్  అయ్యి చేశాడు అని పిస్తుంది.

Love Guru review by 18fms 6

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

‘లవ్‌ గురు’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, సినిమా మేకింగ్ డ్రామా, మరియు కామెడీ అండ్ లవ్ సీన్స్ దియేటర్ లొని ప్రేక్షకులను బాగా ఆలరించాయి అని చెప్పవచ్చు. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో బాగా పండాయి.

ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. ఐతే, కొన్ని సీన్స్ లో ఇంట్రెస్టింగ్ గా సాగని ప్లే తో పాటు ‘రబ్ దే బనా దియా జోడి’ సినిమా అప్పుడప్పుడూ గుర్తుకు రావడం వంటివి సినిమా కి కొన్ని మైనస్ పాయింట్స్.

లవ్ గురు కధ లో మెయిన్ క్యారెక్టర్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంత మేరకు  దెబ్బ తీయవచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది.ఈ వారాంతం లో దియేటర్ లో చూడవలసిన చిత్రం.

love guru Malesia trip 3

చివరి మాట: భార్య – భర్తల లవ్ స్టోరీ గురూ .. !

18F RATING: 3 /5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *