లోపలికి రా చెప్తా సినిమా సాంగ్ లాంచ్ చేసిన డెలివరీ బోయ్!

IMG 20241207 WA0042 e1733545810937

 మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా” ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి సాంగ్ నేడు విడుదల చేశారు.

IMG 20241207 WA0043

సహజత్వానికి భిన్నంగా సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్ తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది .

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ:- మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మా చిత్రంలో మొదటి సాంగ్ ను ఓ డెలివరీ బాయ్ తో చేయాలని నిర్ణయించాం.

IMG 20241207 WA0044

అలాగే సంగీత దర్శకులు డేవ్ జాండ్ (ఈగల్ ఫేమ్ )సారథ్యంలో కపిల్ కపిలన్ ఈ పాట పాడారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు

IMG 20241207 WA0045

కొండా వెంకట రాజేంద్ర ,మనీషా జష్ణాని , సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి ,వాణి ఐడా, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: డేవ్ జాండ్, డిఓపి: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్, ఎడిటర్: వంశీ, పి ఆర్ ఓ :బి. వీరబాబు ప్రొడ్యూసర్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర కథ , స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *