తారకాసుర” సీక్వెల్ సినిమా తో  విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం విజయ దుందుభి మ్రోగించాలి అంటున్న పటాన్ చెరువు ఎమ్మెల్యే

IMG 20230725 WA0112 1

తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే… ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న “తారకాసుర -2” చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది!!

IMG 20230725 WA0113

పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్.ఎల్.ఎ.మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా… జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!!

IMG 20230725 WA0111

“తారకాసుర సిరీస్”తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ “శ్రీజ మూవీస్” బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు.

IMG 20230725 WA0110

తారకాసుర-2″ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *