SAMANTHA MESSAGE TO YASHODA FILM LOVERS: యశోద సినిమా హిట్ చేసిన ఆడియన్స్ కి సమంత స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ?

యశోద సమంతా స్పెషల్ మెసేజ్ టు ఆడియన్స్

ప్రియమైన ప్రేక్షకులకు..

‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.

SAMANTHA WITH FIGHT MASTER 1
‘యశోద’ చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది.

unni Mukundan
ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను.

yasoda producer ShivaPrasad garu 2
నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

hari harish directors of Yashoda movie 2 1
దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు.

వరలక్ష్మి యశోద 3
వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది.

yashoda 20 Cr colelctions poster 1
సదా వినయపూర్వక కృతజ్ఞతలతో…

మీ

సమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *