Love Me  Movie Success meet Highlights: ‘లవ్ మీ’ సక్సెస్  మీట్‌ లో ఆశిష్ ఏమన్నారంటే !

IMG 20240526 WA0000 e1716661905410

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక.

ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేశారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

IMG 20240525 WA00331

ఆశిష్ మాట్లాడుతూ.. ‘చాలా కొత్త సినిమా. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. ఈ కొత్త మూవీని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మా సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది హారర్ కాదు.. దెయ్యాన్ని చూసి భయపడటం కాదు.. ప్రేమించడం అనే కాన్సెప్ట్ మీద తీశాం.

కొత్త అటెంప్ట్ చేసినా ఆదరిస్తారని ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఏ సినిమాకు అయినా ఇలాంటివి కామన్. థియేటర్లో మా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేం కూడా థియేటర్ టూర్ ప్లాన్ చేశామ’ని అన్నారు.

IMG 20240525 WA0129

అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘మేం చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతారని అనుకున్నానో.. అక్కడ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మెల్లిమెల్లిగా అందరికీ అర్థం అవుతుంది. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుంది.

నా పేరు అరుణ్ కాదు. నా ఫ్రెండ్ పేరు అరుణ్. వాడు చాలా బాగా రాస్తాడు. వాడిలా ఆలోచించడానికి, రాయడానికి వాడి పేరు పెట్టుకున్నా. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మెల్లిగా అందరికీ అర్థం అవుతుంది. వైష్ణవి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు థాంక్స్’ అని అన్నారు.

IMG 20240526 WA0002

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ఇదొక డిఫరెంట్, యూనిక్ మూవీ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి చేశారు. ఏ ట్విస్ట్‌కి ఎలా రియాక్ట్ అవుతారని అనుకున్నామో.. ఆడియెన్స్ అలానే రియాక్ట్ అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత హన్షిత మాట్లాడుతూ.. ‘మా సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మూతబడిన థియటర్లు తెరుచుకుంటున్నాయి. ఇంటర్వెల్‌కు ముందు జనాలు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇదేమీ హారర్ మూవీ కాదు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. అందరూ తప్పకుండా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

నాగ మల్లిడి మాట్లాడుతూ.. ‘కొత్త కంటెంట్, ప్రయోగం చేసినప్పుడు డివైడ్ టాక్ కచ్చితంగా వస్తుంది. కానీ త్వరలోనే ఈ మూవీకి యూనానిమస్ రెస్పాన్స్ వస్తుంది. స్లోపాయిజన్‌లా అందరికీ ఎక్కేస్తుంది. మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది’ అని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *