KANTARA SUCCESS TOUR POSTER

సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

కాంతార చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది.

KANTARA COLLECTIONS

 అక్టోబర్ 29న (శనివారం) తిరుపతి థియేటర్ ను సందర్శించారు. అలానే విశాఖపట్నంలో ఉన్న జాగదాంబ థియేటర్ ను కూడా కాంతారా టీం సందర్శించారు.

ఇరు చోట్ల ప్రేక్షకులతో సినిమా విశేషాలను పంచుకుంటూ మాట్లాడారు.

RISHAB SHETTY
ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారు అనుకోలేదు.
2 వారాల్లో ఈ సినిమా 45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా 50 కోట్ల వసూళ్లకు చేరువవ్వడం ఆనందంగా ఉంది.

KANTARA TEAM VIZAG TOUR

ఇంతలా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది.

RISHAB SHETTY AT VIZAG

మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మీరు మెచ్చే, మీకు నచ్చే విధంగా సినిమాలను చేస్తాను.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…

సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం ప్రూవ్ చేసింది. ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు.

బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం. అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *