KANTARA HERO RISHAB SHETTY NEXT FILM IN GEETA ARTS !:: మెగా నిర్మాత అల్లు అరవింద్ “కాంతార” సినిమా సక్సెస్ మీట్ లో ఏమాన్నారు అంటే !

KANTARA HERO IN GEETA ARTS ALLU ARVIND

మట్టిలోంచి పుట్టిన కథే “కాంతార” – మెగా నిర్మాత అల్లు అరవింద్

సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

KANTAARA SUCCESS MEET ARVIND

“కాంతార”   చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

KANTARA SUCCESS MEET ALLU ARVIND ANNOUNCE HIS NEW FILM

“కాంతార” సినిమా రిలీజ్ కంటే ముందు ఒకసారి చూడమని చెప్పాం.చూసి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం ప్రూవ్ చేసింది.

“కాంతార”  సినిమా మట్టిలోంచి పుట్టిన కథ ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్త్వం, రౌద్ర రూపం చూసాక ఇది సింహాచలం కి దగ్గరగా ఉన్న కథ అనిపించింది.

KANTARA RELEASE TODAY 1

“కాంతార” చిత్రంలో హీరో ఎంత గొప్పగా చేసాడో మీరు సినిమాలో చూసారు.అతను ఫీల్ అయ్యి చేయడం వలన ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది.

“కాంతార” సినిమాకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాధ్ ఎక్స్ట్రార్డనరీ బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్ ను రికార్డ్ చేసి మ్యూజిక్ తో పాటు వదిలారు.

kantara telugu 1 1

“కాంతార” సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను.

“కాంతార”  సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం.

KANTARA HERO ACCEPTED ALLU ARVIND OFFER

ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టి ను అడిగాను ఆయన కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే  రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *