అడివి శేష్ ఈ పదం ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ అనే కాకుండా ఇండియా మొత్తం రీసౌండ్ వస్తున్న వర్డ్. ఇప్పడు ఈ రీసౌండ్ లో శేష్ అనే మాట తెలుగు సినిమా ఇండిస్ట్రీ లో వినపడాలని తనకు ఉన్న అమెరికాలో హ్యాపీ లైఫ్ ని వదిలి కస్టాలుతో కూడిన నటనను తన వృత్తిగా సినిమా నే జీవితంగా మాలచికొని గత కొంత కాలంగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పాడు.
ఈ రోజు రిలీజ్ అయిన హిట్ 2 హిట్ సందర్బంగా హీరో ప్రొడ్యూసర్ నాని ఆఫీసు లో ఛాంపియన్ పార్టీ చేసుకొంటూ మాకు చిన్న చిట్ చాట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు శేష్.

ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు శేష్ అనే యాక్టర్ సినిమా యాక్టర్స్ హీరో అయిపోయాడు. తెలుగు సినిమా టాప్ స్టార్స్ తమ స్వంత ప్రొడక్షన్ లో శేష్ ని హీరో గా పెడితే మంచి లాభాలు వస్తాయి అని ఆలోచించి తనతో ఒకరు తరువాత ఒకరు సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ అనే అడివి శేష్ ని తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కోత్త స్టొరీ పాయింట్స్ తో, మంచి స్క్రిప్ట్ లతో సినిమాలు చేసే ఈ హీరో లేటెస్ట్ మూవీ హిట్2 నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యింది.

ఈ హిట్ 2 nd కేస్ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా హిట్ సిరీస్ లో భాగంగా తెరకు ఎక్కింది. తెలుగు స్టేట్స్ లో హిట్ హిట్ అంటూ సినీ అభిమానులు రీసౌండ్ చేస్తూ డీయేటర్స్ ని నింపేస్తున్నారు,

ఈ సినిమా యొక్క ప్రమోషన్ల సందర్భంగా, నటుడు తన చివరి చిత్రం మేజర్ విడుదలైన తర్వాత దాదాపుగా 10 బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు నో చెప్పినట్లు వెల్లడించాడు.
తనకు టాలీవుడ్‌లో కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు ఉన్నందున వాటిపై సంతకం చేయడానికి నిరాకరించానని చెప్పాడు. హిట్ 2తో సహా తన రాబోయే సినిమాలు హిందీలో కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు.

హీరో అనే కంటే మంచి నటుడు అంటేనే ఇస్తాపడే శేష్ తన తదుపరి చిత్రాల లిస్ట్ చెప్తూ… గూడాచారి సీక్వెల్. గూడాచారి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి ఇంకా 6 నెలల సమయం పడుతుందని శేష్ చెప్పాడు.

మరో ప్రెస్టీజియస్ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ కి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు చెప్పాడు. చూద్దాం అడివి శేష్ నుండి ఎలాంటి ప్రొజెక్ట్స్ బయటికి వస్తాయో.. అప్పటివరకు హిట్ 2 చూస్తూ ఎంజాయ్ చేయాయండి.