మూవీ: లింగొచ్చా
విడుదల తేదీ : అక్టోబరు 27, 2023
నటీనటులు: కార్తీక్ రత్నం, సుప్యార్దీ సింగ్, బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోత్ రమేష్, ఉత్తేజ్
దర్శకుడు : ఆనంద్ బడా
నిర్మాత: యాదగిరి రాజు
సంగీతం: బికాజ్ రాజ్,
ఎడిటర్: మ్యాడీ అండ్ బడా శశికాంత్,
కార్తీక్ రత్నం అనే కొత్త కుర్రాడు తెలుగు తెరమీద తన ఉనికి చాటుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య C/o కంచెరపాలెం, నారప్ప చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నా మధ్యలో చిన్నగా OTT లో కనపడినా సోలో నటుడిగా ఫుల్ లెంగ్త్ పాత్ర తొ తన అదృష్టాన్ని వెండితెర మీద పరీక్షించుకోవాలి ఆని గట్టిగా చేసిన ప్రయత్నమే లింగోచ్చా సిన్మా.
ఆనంద్ బడా దర్శకత్వం వహించిన ఈ లింగోచ్ఛా సినిమా పూర్తిగా పాతబస్తీ బ్యాక్ డ్రాప్ లో చేసిన మాస్ ఎంటర్టైనర్. ఈ శైన్మా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్తిక్ పోరాడు నటించిన లింగొచ్చా సిన్మా తెలుగు ప్రేక్షకులని ఏమేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీమ్ సమీక్ష లో చదివి తెలుసుకుందామా !.
కధ (Story Line) పరిశీలిస్తే:
హైదరాబాద్ లో పాతబస్తీ అని పిలవబడే ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఈ లింగోచ్చా సినిమా సెట్ చేయడం జరిగింది.
కధ లో శివ (కార్తీక్ రత్నం) మరియు నూర్జహాన్ (సుప్యార్దీ సింగ్) పక్క పక్క గల్లిలలో ఉంటూ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ఇష్ట పడతారు. అయితే నూర్జహాన్ అనుకోకుండా దుబాయ్ కి పోతుంది. కానీ శివ మాత్రం నూర్ కొసం ఎదురు చూస్తూనే ఉంటాడు. తండ్రికి ఉన్న బార్బర్ షాప్ లో పనిచేస్తూ తన దొస్తులతొ ఎంజాయ్ చేస్తూ నూర్ ఆలోచనలతో బతికేస్తూ వుంటాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత, నూర్జహాన్ భారతదేశానికి తిరిగి వస్తుంది. మళ్లీ ఈ జంట ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. కానీ నూర్జహాన్ సోదరుడు అన్వర్ (కునాల్ కౌశిక్) వారి ప్రేమకి అడ్డు చెబుతాడు.
శివను నూర్జహాన్ నిజంగానే ప్రేమిస్తుందా ?
శివ మరియూ నూర్ ఎందుకూ ఇంట్లో నుండీ పారిపోవాలి అనుకొన్నారు ?
శివ మంచివాడా ? చెడ్డవడా?
శివ నూర్ ల ప్రేమను శివ తండ్రీ ఎందుకూ కాదంటాడు ?
శివ నూర్ క్లాస్ మేట్స్ తొ ఎందుకు గొడవ పడతాడు?
చివరకు శివా నూర్జహాన్ పెళ్లి చేసుకున్నారా
శివ నూర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే దియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి.
కథనం (Screen – Play) పరిశీలిస్తే:
లింగోచ్చా కి అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పాతబస్తీ బ్యాక్ డ్రాప్ లో ఉండటం వలన అక్కడ యువత జీవన శైలి లోనే కామిక్ టచ్ ఉన్న పిట్ట కథలు మనం చాలా విని ఉంటాము దర్శకుడు కథనం ( స్క్రీన్ – ప్లే ) కుడా అలాంటి పిట్టకథలు కు వేదిక అవుతున్న షేవింగ్ షాప్ లోనే కధను ఓపెన్ చెయ్యడం.
ఇంక ఈ లింగోచ్చ కి మైనస్ ఉంది అంటే అది, అందరికీ తెలిసిన స్టోరీ లాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా సిన్మా కథలో ప్రధాన జంట వేర్వేరు మతాలకు చెందినవారు, అబ్బాయి అవరా గా తిరుగుతూ వుంటాడు, అమ్మయి మెడికల్ స్టూడెంట్ కాబట్టీ, అమ్మాయి తల్లిదండ్రులు సహజంగా వారి ప్రేమను వ్యతిరేకిస్తారు.
ఇలాంటి కధ కి గ్రిప్పింగ్ గా ఉండే కథనం (స్క్రీన్ ప్లే) చాలా అవసరం. కానీ లింగొచ్చా కథనం అంత ఎనర్జిటిక్ గా సాగదు. చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్ ) పోరాళ్ళ కామిడీ సీన్ల తొ జస్ట్ ఓకే అనిపించుకున్నా , రెండవ అంకం (సెకండాఫ్) మాత్రం కొంచెం బోరింగ్ గా ఉంది. హీరో మరియు హీరోయిన్ మధ్య ప్రేమా, తగాదా అనేవి సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు.
డైరెక్టర్ ఎంచుకున్న కథా వస్తువు బాగానే ఉన్నా, అది కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేక పోయాడు. హీరో పాత్ర మొదటి అంకం లో దోస్తులు ప్రేమా అంటూ వున్నా రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో చాలా మారుతుంది. ఇలా ఎందుకూ బిహేవ్ చేస్తుందో అర్ధం కాదు. ఇలాంటి ట్విస్టుల ఉన్నప్పుడు ఓక స్ట్రాంగ్ సీన్ ఉండి డ్రైవ్ చేస్తే ప్రేక్షకుడు ఉత్కంఠ గా ఉంటాడు. కానీ సిల్లీ గా నార్మల్ కథనం లో సాగిపోతుంది. ఇలాంటి సీన్లు డైరెక్టర్ మరింత బాగా హ్యాండిల్ చేసి ఉండవచ్చు.
ఈ లింగొచ్చ సైన్మ మొదటినుండి కథనం చాలా స్లో గా సాగుతుంది. కామెడీ సన్నివేశాలు కుడా అనుకున్నంతగా బాగా రాలేదు. అంతేకాక హీరోయిన్ సోదరుడి పాత్ర చాలా ముఖ్యం ఆయిన పాత్ర, కాని దాని ఎస్టాబ్లిష్ మెంట్ అసలు బా లేదు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశీలిస్తే:
డైరెక్టర్ ఆనంద్ బడా రొటీన్ స్టోరీ లైన్ నే తీసుకొన్నా పాతబస్తీ లో పొరగాళ్ళ అల్లరితో కధనం నేరేట్ చేయడం వలన ఇంటరెస్టింగ్ గా ఓపెన్ అయినా హీరో హీరోయిన్ మధ్య స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేక పోవడం కొంత మైనస్ ఆని చెప్పవచ్చు.
ఇలాంటి చిన్న సీన్ల మిద శ్రద్ధ వహించి ఉంటే లీంగొచ్చ సిన్మా ఫలితం వేరేలా ఉండేది. క్లైమాక్స్ మాత్రం చాలా డీసెంట్‌గా డిజైన్ చేసి కార్తిక్ రత్నం నుండీ మంచి నటన రాబట్టడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు ఆని చెప్పవచ్చు.
యువ నటుడు కార్తీక్ రత్నం తన నటనతో ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం లో మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు. శివగా అతని సహజమైన నటన చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు.
సుప్యార్దీ సింగ్ లేడీ లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కార్తీక్ రత్నంతో సుప్యార్దీ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే ఉంది.
ఉత్తేజ్, తాగుబోతు రమేశ్, సద్దాం కుడా బాగానే చేశారు. మిగిలిన పాత్రలలో నటించిన నటి నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ బికాజ్ రాజ్ తన మ్యూజిక్ తొ ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే పాట అయితే అందరినీ మెప్పిస్తుంది.
సీనిమాలో విజువల్స్ బాగున్నాయి, ఓల్డ్ సిటీని చాలా బాగా చిత్రీకరించారు.
ఎడిటింగ్ ఇంకా కొంచెం ట్రిమ్ చేసి ఉండవలసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
18F MOVIES టీమ్ ఒపీనియన్:
కార్తిక్ రత్నం లింగోచ్చా అనే టైటిల్ తో పాటూ లుక్ లో కొత్తగా కనిపించినా ఓల్డ్ స్టోరీ తో బోరింగ్ గా సాగే రొమాంటిక్ డ్రామా చేశాడా అనిపిస్తోంది. హీరో హీరోయిన్ లు అయిన కార్తీక్ రత్నం మరియు సుప్యార్దీ సింగ్ ల నటన ఆకట్టు కుంటుంది. కానీ ఈ సినిమాలో ఆసక్తికరం గా సాగే కధనం (స్క్రీన్ ప్లే) లేదు.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో నటీనటుల పర్ఫార్మెన్స్ లు బాగానే ఉన్నప్పటికీ, రెండవ అంకం ( సెకండ్ హాఫ్) మాత్రం బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. కానీ పాతబస్తీ కధలూ, అక్కడి పాత్రల స్వభావం నచ్చిన వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
రెగ్యులర్ సిన్మా ఆడియెన్స్ కి మాత్రం ఏ మేరకు ఆకట్టు కుంటుంది అనేది రెండు మూడు రోజులు తర్వత తెలుస్తుంది. మేము మాత్రం ఫస్ట్ హాఫ్ బాగానే ఎంజాయ్ చేసినా రెండవ అంకం మాత్రం నీరసం వచ్చిందీ. కానీ, కార్తిక్ రత్నం చేసిన ఈ ప్రయత్నానికి హాట్స్‌ఫ్ చెప్పవచ్చు.
చివరి మాట: పాత బస్తీ పోరాడి ప్రేమాట,
18F RATING: 2.75 / 5 ,
కృష్ణ ప్రగడ.