చిత్రం: లీగల్లి వీర్ (Legally Veer )
విడుదల తేదీ : డిసెంబర్ 27, 2024,
నటీనటులు : మలికిరెడ్డి వీర్ రెడ్డి , తనూజ పుట్టస్వామి, దయానంద్ రెడ్డి, బేబీ శాన్య తదితరులు.
డైరెక్టర్ :రవి గోగుల ,
ప్రొడ్యూసర్ : మలికిరెడ్డి శాంతమ్మ,
సినిమాటోగ్రఫీ : జాక్సన్ జాన్సన్ – అనూష్ గోరక్ ,
మ్యూజిక్ : శంకర్ తమిరి ,
ఎడిటింగ్ :వేణు ,
మూవీ: లీగల్లి వీర్ రివ్యూ (Legally Veer Movie Review)
మలికిరెడ్డి వీర్ రెడ్డి స్వతహాగా అడ్వకేట్ గా అమెరికా లో పనిచేస్తూ ఇండియా వచ్చినప్పుడు తన ద్వారా సమాజానికి ఏదోకటి చేయాలనే సంకల్పం తో తనకు తెలిసిన కోర్టు డ్రామా సన్నివేశాలతో “లీగల్లీ వీర్” (Legally Veer) అనే సినిమా ను తనే నటిస్తూ నిర్మించారు.
లీగల్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా గా నిర్మించిన “లీగల్లీ వీర్” (Legally Veer) చిత్రం డిసెంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోగా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వీర్ రెడ్డి గారూ ఏమేరకు తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించారో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !.
కధ పరిశీలిస్తే (Story Line):
వీర రాఘవ (మలికిరెడ్డి వీర్ రెడ్డి) తండ్రి ఆశయం కోసం న్యాయపట్టా పొందినా తనకు లాయర్ గా ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేక విదేశాలకు వెళ్లిపోతాడు. అక్కడ పర్సనల్ జీవితం లో ఓడిపోయి ఇండియా లొని స్వంత ఇంటికి చేరి తండ్రి ఆదరణ దక్కక భాదపడుతూ ఉంటాడు. తండ్రి ఆదరణ తనకు డక్కలి అంటే మరలా న్యాయవాది గా ప్రాక్టీస్ చేయాలని తన ఫ్రెండ్ తో చెప్పి ప్రాక్టీస్ మొదలుపెడతాడు.
బాలరాజు అనే సామాన్య కారు డ్రైవరు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య అతడు చేయకపోయినా.. అతనే చేసినట్లు అన్నీ కోణాల నుండి నిరూపించడానికి డిఫెన్స్ కి ఛాన్స్ ఉంటుంది. అలాంటి తరుణంలో బాలరాజు భార్య కూతురి వేదనకు చలించిపోయి రాజు తరపున వాదించడానికి కేస్ టేకప్ చేస్తాడు వీర్ (మలికిరెడ్డి వీర్ రెడ్డి).
ఎన్నో వ్యతిరేకతలు ఉన్నా రాజు కేస్ ఒప్పుకోవాల్సి వస్తుంది వీర్ కి . రాజు కేస్ లో ఊహించినదానికంటే ఎక్కువ కోణాలు ఉన్నాయని, చాలా మంది ఈ కేసు వెనుక ఉన్నారని తెలుసుకుంటాడు వీర్.
తండ్రి ఆశయం కోసం న్యాయవాది పట్టా తీసుకొన్నా వీర్ ప్రాక్టీస్ ఎందుకు మానేశాడు? ,
లాయర్ గా వీర్ మరలా కోర్టు మెట్లు ఎందుకు ఎక్కవలసి వచ్చింది?,
లాయర్ వీర్ పర్సనల్ కధ ఏమిటి ?, తండ్రి కధ ఏమిటి ?,
వీర్ బాలరాజుని కేసు నుండి బయటపడేయగలిగాడా? లేదా ,
వంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే వెంటనే దగ్గరలొని థియేటర్ కి వెళ్ళి “లీగల్లీ వీర్” చిత్రం చూసేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
సామాన్య ప్రజలకు న్యాయం దొరకాలి అనే పాయింట్ చుట్టూ రాసుకొన్న కధ చాలా బాగుంది. కానీ దర్శకుడు ఇంత మాంచి విశయాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ వే లో చెప్తూనే చిత్ర కధనాన్ని ( స్క్రీన్ – ప్లే ) మాత్రం కొంచెం కమర్షియల్ పందా లో చెప్పినట్టు అనిపిస్తుంది. సినిమాటిక్ లిబర్టీ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయినటువంటి పాటలు రొమాంటిక్ సీన్స్ ని ఈ కధ లో ఇరికించినా మరికొన్ని సీన్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తల వలన ప్రేక్షకులు కధనం నుండి డీవియేట్ అవ్వరు.
కోర్టు రూమ్ కథను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మరీ ఎక్కువగా డీవియేట్ చేయకుండా కధనం నడిపించినందుకు దర్శకుడు రవి గోగుల ను మెచ్చుకోవాలి. కధలొని ముఖ్య పాత్రలకు ఎన్నుకొన్న నటులు కొత్తవారు కావడం వలన కూడా కొంతవరకూ సినిమా సహజంగా సాగింది. మొదటి అంకం ( ఫస్ట్ ఆఫ్ ) కూడా కొంచెం థ్రిల్లింగ్ అంశాలతో ఎంగేజ్ చేసి ఉంటే సినిమా రిసల్ట్ ఇంకా బాగుండేది.
ఇంటర్వల్ బ్యాంగ్ నుండి కధ – కధనం సస్పెన్స్ థ్రిల్లర్ రూటు లో వెళ్ళడం వలన థియేటర్ లొని ఆడియన్స్ క్లైమాక్స్ వరకూ సీట్ ఎడ్జ్ లో కూర్చుని చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు రవి గోగుల ఎంచుకున్న కథలో న్యాయం – ధర్మం ఉన్నాయి అనిపిస్తుంది. అయితే కొంత మేరకు కినిమాటిక్ లిబర్టీ కోసం కమర్శియల్ పాటలు, కొన్ని సీన్స్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఈ కధనం లో ఇరికించకుండా ఉండుంటే కచ్చితంగా మంచి థ్రిల్లర్ సినిమాగా నిలబడేది.
ఈ సినిమా టైటిల్ పాత్రధారి మలికిరెడ్డి వీర్ రెడ్డి నటించడానికి కాస్త ఇబ్బందిపడుతూనే తన పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు. లాయర్ గా స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ ఎక్కువగా ఇంగ్షీషు పదాలు పలకడం మరియు లీగల్ వర్డ్స్ వలన రూరల్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా కొంతవరకూ పరవాలేదు అనిపించేలా నటించాడు.
కమర్షియల్ యాక్షన్ సినిమా లాగా పాటలు, డాన్సులు మరియు రొమాంటిక్ సీన్స్ తో కధానాయకుడు వీర్ రెడ్డి మెప్పించే ప్రయత్నం చేసినా ఇలాంటి థ్రిల్లర్ కధకు అవి ఎక్సట్రా అనిపించాయి .
నటుడు గిరిధర్ కూడా వీర్ కి స్నేహితుడిగా నటించి మెప్పించాడు. సినిమా లో ఎంతో కొంత కామిడీ ఉంది అంటే అది గిరి పాత్ర ద్వారా ఫిల్ అయ్యింది అని చెప్పవచ్చు.
దివంగత ఢిల్లీ గణేష్ ను ఈ చిత్రంలో తండ్రి పోషించడం విశేషం. ఉన్నంతలో చాలా చక్కగా నటించాడు. ఆలానే తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా చక్కగా నటించారు.
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి కూడా మరో ముఖ్య పాత్రలో సహజంగా నటించి మెప్పించింది. బాలరాజు పాత్ర పోషించిన యువకుడు చాలా సహజంగా నటించాడు. బాలరాజు భార్య పాత్ర పోషించిన యువతి కూడా చక్కగా పాత్రలో ఇమిడిపోయింది. దయానంద్ రెడ్డి తదితర నటి నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
శంకర్ తమిరి సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా తెరమీద ఒక సాంగ్ లో ప్రేమ్ రక్షిత్ + రోల్ రైడా చేసిన ర్యాప్ సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ లో ఆకట్టుకొనేలా ఉంది.
ఛాయాగ్రాహకులు జాక్సన్ జాన్సన్ & అనూష్ గోరక్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. చిన్న సినిమాలా కాకుండా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.
ఇక హీరోనే నిర్మాత కావడంతో.. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు అని స్పష్టమయ్యింది. ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు లేకపోవడం వలన మీడియం బడ్జెట్ సినిమాల స్థాయి లో ఉంది. ఓవరాల్ గా కెమెరా వర్క్ + ప్రొడక్షన్ డిజైన్ ఈమధ్యకాలంలో వచ్చిన చాలా చిన్న సినిమాలకంటే బెటర్ గా ఉంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
వంద మంది నేరస్తులు తప్పించుకొన్నా పరవాలేదు కానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు అంటారు. కానీ మన “లీగల్లీ వీర్” (Legally Veer) కధ మాత్రం వంద మంది నేరస్తులు చట్టం నుండి తప్పించుకో కూడదు, అలానే సామాన్యులకు కూడా న్యాయం డబ్బున్న వారితో సమానంగా దక్కాలి అంటుంది.
మంచి లీగల్ సన్నివేశాలతో కధ రాసుకొన్నా కొన్ని అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో మొదటి అంకం ( ఫస్ట్ ఆఫ్ ) స్లో అయ్యింది అనిపిస్తుంది.
వకీల్ సాబ్ లాంటి కోర్టు డ్రామా సినిమాలో పవన్ కళ్యాణ్ ని మన తెలుగు సినిమా ప్రేక్షకులు చూశారు కాబట్టి, ఈ కధలొని వకీల్ పాత్రకు కూడా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాస్త పేరున్న కథానాయకుడు ఉండి ఉంటే కచ్చితంగా మంచి సక్సెస్ సాదించే దమ్మున్న కధ ఇది.