‘లీగల్లీ వీర్’ లొ రియల్ కోర్ట్ డ్రామా చూస్తారు : హీరో వీర్ రెడ్డి

IMG 20241209 WA0132 e1733742990134

సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు.

సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

IMG 20241209 WA0130

హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.  కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది.

ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.

IMG 20241209 WA0133

డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ మాట్లాడుతూ..  ‘నిర్మాత వీర్ సార్ చాలా కూల్‌గా ఉంటారు.. ఇందులో నేను ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను. అది అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

IMG 20241209 WA0134

నటుడు గిరిధర్ మాట్లాడుతూ.. ‘కొత్త టీం అయినా కూడా సినిమా ని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.

నటీనటులు :

వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్, జబర్దస్త్ అప్పారావు, జయశ్రీ రాచకొండ, కల్పలత, లీలా శాంసన్, మిర్చి హేమంత్, ప్రీతి సింగ్, వీర శంకర్, వినోద్

 

సాంకేతిక బృందం: 

బ్యానర్ : సిల్వర్‌కాస్ట్, సమర్పకులు : స్వర్గీయ ఎం.వీరనారాయణ రెడ్డి, నిర్మాత: శాంతమ్మ మలికిరెడ్డి, దర్శకుడు: రవి గోగుల, డి ఓ పి : జాక్సన్ జాన్సన్, అనుష్, సంగీతం : శంకర్ తమిరి,ఎడిటర్: ఎస్ బి  ఉద్ధవ్,, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చైతన్య రెడ్డి, సాహిత్యం: శ్యామ్ కాసర్ల, భరద్వాజ్ గాలి, రోల్ రైడా, కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్, యాక్షన్: రామకృష్ణ, పి ఆర్ ఓ : పాల్ పవన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *