LGM Movie Telugu Review & Rating by 18F: ఆకట్టుకో లేకపోయిన అత్తా – కోడళ్ళ డ్రామా !

LGM Review by 18F Movies e1691169872982

మూవీ: (LGM – Let’s Get Married):

విడుదల తేదీ : ఆగస్టు 4, 2023

నటీనటులు: హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగి బాబు, RJ విజయ్ మరియు ఇతరులు

దర్శకుడు : రమేష్ తమిళమణి

నిర్మాతలు: సాక్షి సింగ్ ధోనీ, వికాస్ హసిజా

సంగీతం: రమేష్ తమిళమణి

సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒడుక్కతిల్

ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్

LGM Review by 18F Movies 6

LGM మూవీ రివ్యూ:

ప్రఖ్యాత క్రీకెటర్ మరియు చెన్నై సూపర్ సింగ్స్ రధ సారధి మహీంద్ర సింగ్  ధోనీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఎక్కువగా చెన్నై లో ఉంటుండడం వాలనో ఏమో కానీ తన భార్య సాక్షి సింగ్ తో కలసి ధోనీ ఎంటర్టైన్మెంట్ అనే  ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, మొదటిగా తమిళం లో  నిర్మించిన మూవీ LGM (లెట్స్ గెట్ మ్యారీడ్‌). 

ఈ సినిమాని అదే పేరుతో తెలుగు లో డబ్బింగ్ చేసి ధోనీ ఎంటర్టైన్మెంట్ ద్వారా నే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ LGM సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు.

 ఈ LGM సినిమా లో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు.

ఈ LGM సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి LGM సిన్మా తెలుగు  ప్రేక్షకులను  ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ టీం  సమీక్ష చదివి తెలుసుకుందామా !

కథ ని పరిశీలిస్తే (Story line):

LGM Review by 18F Movies 4

గౌత‌మ్(హ‌రీష్ క‌ళ్యాణ్‌) తన ఆఫీసు లోతన తోనే ప‌నిచేస్తున్న మీరా(ఇవానా)ను రెండేళ్లుగా ప్రేమిస్తూ, ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. మరోవైపు తండ్రి లేని తన కొడుకు గౌతమ్ కి అన్నీ తానే కాబట్టి  త్వరగా పెళ్లి చేస్తే కొడుకు ఓ ఇంటి వాడు అవుతాడు అని అందరితో చెప్తూ పెళ్లి చేయాలని అతని తల్లి లీలా(నదియా) ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మీరాతో తన లవ్ మ్యాటర్ గురించి తల్లికి చెప్తాడు గౌతమ్.

లీలా కూడా వెంటనే పెళ్లికి ఓకే చెబుతుంది. పైగా తను ఒక్కత్తే మరియు ఒక్కడే కొడుకు కాబట్టి, కోడలిని కూతురుగా చూసుకోవాలని ఆశ పడుతుంది. కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్యలో ….

LGM Review by 18F Movies 8

మీరా గౌతమ్ తో పెళ్లి కి ముందు చిన్న షాక్ ఇస్తోంది ?,

మీరా గౌతమ్ తో పెళ్లికి వద్దు అని చెప్పడానికి మీరాకి ఉన్న సమస్య ఏమిటి ?,

మీరా గౌతమ్ కి ఎలాంటి షరతు పెట్టింది ?,

మీరా గౌతం తల్లితో ఏమి చెప్పింది ?

గౌతం తల్లి కూడా మేర తో పెళ్లి వద్దు అందానికి కారణం ఏంటి ?

మీరా గౌతం విడిపోయారా ? గౌతం మీరా ఫామిలీస్ తో ట్రిప్ కి ఎందుకు వెళ్లారు ?

ఆకారకు మీరా గౌతం పెళ్లి చేసుకొన్నారా ? లేదా ?

అనంతరం జరిగిన సంఘటనలు ఏమిటి ?,  అనేది మిగిలిన కథ.

LGM Review by 18F Movies 1

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

దర్శకుడు ర‌మేష్ త‌మిళ‌మ‌ణి తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం (స్క్రీన్ ప్లే ) మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల కధనం ( స్క్రీన్ ప్లే) ఆకట్టుకోలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగింది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స్ కూడా అన్నీ సినిమా లలో ఉండే రెగ్యులర్ సీన్స్ గానే ఉన్నాయి. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన కామెడీ సన్నివేశాలను జోడించాడు.

పైగా కథను నడిపించే కధనం,  బలం  పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.

LGM Review by 18F Movies 6

సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అదే విధంగా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయి. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

ఇక రెండవ అంకం (సెకెండాఫ్) ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని అత్తా కోడళ్ళు మధ్యలో డ్రామా రాసుకొని దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు, కానీ రెండవ అంకం లో ఫేక్ ఏమోసన్స్ తో స్లో గా ఉండుట వలన ఎక్కడా అనుకొన్న ఎమోషన్ వర్కౌట్ కాలేదు.

LGM Review by 18F Movies 5

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

  మ్యూజిక్ దర్శకుడు అయిన  ర‌మేష్ త‌మిళ‌మ‌ణి దర్శకుడుగా మారి మొదటిసారి దర్శకత్వం వహించిన చిత్రం LGM.  తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా, చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోతున్న కొత్త జంటలు,  ఓకే ఇంట్లో కలిసి ఉండబోయే అత్తాకోడళ్ళు ఒకర్ని ఒకరు అర్థం చేసుకుని  ముందుకు వెళ్తే బాగుంటుంది అనే కోణంలో రాసుకొన్న కధ, పేపర్ మీద బాగున్నా సినిమా గా మలిచెటప్పటికి   డ్రామా స్లో అయిపోయింది.

అలాగే దర్శకుడు ఈ సినిమాలో అత్తకి – మోడ్రన్ కోడలికి మధ్య అద్భుతమైన జర్నీని కూడా చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు కుర్రాళ్ళ భావోద్వేగాలు బాగున్నాయి.

LGM Review by 18F Movies 11

హీరోగా హరీష్ కళ్యాణ్ తన ఈజ్ యాక్టింగ్ తో  అఅద్భుతమైన  పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. గౌతమ్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు.

హీరోయిన్ గా నటించిన ఇవానా తన నటనతో పాటు తన లుక్స్ తోనూ ఆకట్టుకుంది. మోడ్రన్ గర్ల్ గా చాలా చక్కగా నటించి మెప్పించింది.

మరో కీలక పాత్రలో నటించిన నదియా నటన కూడా చాలా బాగుంది. అమ్మగా, అలాగే అత్తా గా చివరిలో మోడ్రన్ లేడి గా బాగా చేసింది.

యోగిబాబు మాత్రం తన హవ భావాలతో  నవ్వించాడు. క్లైమాక్స్ సీన్ లో అయితే నవ్వకుండా ఉండలేము.

ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

LGM Review by 18F Movies 3

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

 దర్శకుడు తమిళమని మంచి కథాంశంతో ఆకట్టుకున్నా.. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఏ మాత్రం బాగాలేదు కానీ సిన్మా  సంగీతం మాత్రం బాగుంది.

తమిళమని అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.

ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్  అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.

 విశ్వజిత్ ఒడుక్కతిల్ అందించిన  సినిమాటోగ్రఫీ బాగుంది. హిల్ స్టేషన్ కూర్గ్ ని ప్రెసెంట్ చేసిన విధానం బాగుంది.

ఇక నిర్మాత సాక్షి సింగ్ దోని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. గోవా బీచ్, కూర్గ్ ప్రాంతం లో అద్భుతమైన ప్రదేశాలలో ఖర్చుకు వెనకాడకుండా చేయడం వలన సినిమా రిచ్ గా ఉంది.

LGM Review by 18F Movies 7

18F మూవీస్ టీం ఒపీనియన్:

LGM (లెట్స్ గెట్ మ్యారీడ్‌)  గా వచ్చిన ఈ సినిమా లో మెయిన్ పాయింట్ అండ్ అత్తా కోడలు మద్య ఎమోషన్ అలాగే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కాబోయే అత్తాకోడళ్ళ మధ్య దూరం కంటే సఖ్యత కోసం చేసే ప్రయత్నాలు తాలూకు సీన్స్ కూడా పర్వాలేదు. కానీ, రెగ్యులర్ అండ్ సిల్లీ డ్రామా లాంటి కధనం వలన సినిమా స్లో గా నడిచి  ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది.

ముఖ్యంగా పెళ్లి చేసుకో బోయే  లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని పాయింట్ మరియు  కొన్ని అంశాలు నచ్చుతాయి. ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుంది కాబట్టి, అత్తా – కోడళ్ళు మరియు ఫ్యామిలీ అంతా ఈ సినిమా ఓటీటీలో కానీ టివి లో కానీ హ్యాపి గా చూడవచ్చు. దియేటర్ లో చూసే అంత సిన్మా అయితే కాదు.

LGM Review by 18F Movies 10

టాగ్ లైన్:లవర్స్ కి మాత్రమే !

18F Movies రేటింగ్: 2.5 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *