దళపతి విజయ్, త్రిష హీరోగా హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “లియో” సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న విశయం తెలిసిందే ! . తమిళ నాట రికార్డులు తిరగ రాస్తున్న ఈ చిత్రం విషయంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే రిలీజ్ తర్వాత ఒకొకటి గా బయటకొచ్చి సోషల్ మీడియా లో వైరల్ గా అవుతున్నాయి.
అయితే వీటిలో లియో లో చూసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురుంచి ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి ఈ ఎపిసోడ్ సహా లియో పార్ట్ 2 పై కూడా లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లియో కి పార్ట్ 2 ఉంటుంది అని అలాగే ఇందులో లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి న్యాయం చేసే విధంగా తాను డిజైన్ చేస్తానని అలాగే చాలా ప్రశ్నలకి సమాదానాలు కూడా రివీల్ చేస్తానని చెప్పినట్టు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి.
LEO2 గురించి చెప్తూనే OTT కోసం డెఫెరెంట్ వెర్షన్ ని ఎడిట్ చేసినట్టు చెప్తున్నారు. OTT లో రన్ టైమ్ ప్రాబ్లం లేదు కాబట్టి తన దగ్గర ఉన్న రస్ నుండి కొంచెం డెఫెరెంట్ గా ఎడిట్ చేసినట్టు లోకేష్ టీం మెంబర్ చెప్తున్నారు. ఇంకా విజయ్ ఫాన్స్ ని థ్రిల్ చేయడం కోసం ఇంకా మిగిలిపోయిన కొన్ని హీరో ఏలివేసన్ షాట్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు అంట.
లియో సినిమా ని నెట్ ఫ్లిక్స్ (Netflix – India) కొనుగోలు చేసింది. నవంబర్ 21 న తెలుగు, తమిళం తో పాటు హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకొన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి లియో సెకండాఫ్ విషయంలో ఒక రకమైన ఇల్ల్యూషన్ ఇప్ప్పుడు నడుస్తుంది అని చెప్పొచ్చు.
సొ, ధళపతి విజయ్ ఫాన్స్ నవంబర్ 21 వరకూ వెయిట్ చేయక తప్పదు. అన్నట్టు లోకేష్ LCU లో భాగంగా LEO-2 ఎప్పుడు తెర పైకి తెస్తాడో చూడాలి. ఇంతకు ముందు అనన్స్ చేసినట్టు సూర్య తో అలెక్స్, కార్తీ తో ఖైదీ-2, కమలహాసన్ తో విక్రమ్- 2 ఎప్పుడు చేస్తాడో పెరుమాళ్ కె ఎరుక !
ప్రస్తుతం లోకేశ్ కనకారాజ్ సూపర్ స్టార్ రజనికాంత్ తో (Thalaiva -171) సన్ పిక్చర్స్ కోసం చేస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్నారు.