LEO Telugu Review & Rating: విజయ్ లియో సిన్మా హిట్టా! ఫట్టా అంటే!

InShot 20231020 190604394 e1697809109926

మూవీ: లియో 

విడుదల తేదీ : అక్టోబరు 19, 2023

నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ మరియు మిస్కిన్ తదితరులు.

దర్శకుడు : లోకేష్ కనగరాజ్

నిర్మాతలు: S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్: ఫిలోమిన్ రాజ

మూవీ రివ్యూ: లియో (LEO Movie)

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కధ పరిశీలిస్తే: 

20231020 190031

పార్తీబన్ (విజయ్) తన భార్య సత్య (త్రిష) ఇద్దరు పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్ థియగ్ లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ అలాగే తను నడిపే కాపీ షాప్ తప్ప పార్తీబన్ కి మరో లోకం తెలియదు.

అలాంటి పార్తీబన్ కి గతంలో ఘోరమైన నేర చరిత్ర ఉందని.. అతను లియో దాస్ అని, ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) తన గ్యాంగ్ తో కలసి తెలంగాణా నుండీ వస్తాడు.

ఇంతకీ, ఈ ఆంటోనీ దాస్ ఎవరు ?,

అతనికి పార్తీబన్ కి ఉన్న సంబంధం ఏమిటి ?,

అసలు లియో దాస్ ఏవరు ?,

ఈ లియో దాస్ కి పార్తీబన్ కి మధ్య సంబంధం ఏమిటి?

ఇద్దరూ ఒకేలా ఎలా ఉన్నారు?,

పార్తీబన్ దాస్ నుండీ తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకున్నాడు ?,

అలాగే పార్తీబన్ – లియో ఒక్కటేనా ?, కాదా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే దియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి.

కథనం (స్క్రీన్ – ప్లే) పరిశీలిస్తే:

20231020 190144

లియో పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న లోకేష్ కనగరాజ్, అంతే స్థాయిలో ఈ లియో సినిమా కథనీ డ్రైవ్ chese ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా గత తన సినిమాల శైలిలోనే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు.

కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్రలు అయిన సంజయ్ దత్, అర్జున్ పాతలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి.. అంతే ఎఫెక్టివ్ గా ముగింపు ఇవ్వాల్సింది. ఓవరాల్ గా ఈ లియో సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశీలిస్తే:

20231020 190052

దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథలోనే కొన్ని సన్నివేశాలలో యాక్షన్ మోతాదుకి మించి ఉన్నాయా అనిపిస్తోంది. ఫ్యామిలీ సెంటిమెంట్ మరియూ ఎమోషనల్ మూడ్ క్యారీ చేసినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన లియో కథా-కథనాలను రాసుకో లేకపోయాడు అనిపిస్తోంది.

దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అనిపిస్తోంది.

దళపతి విజయ్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో విజయ్ చాలా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సీన్లు లలో అయితే సెట్టెల్డ్ ఫార్ఫర్మెన్స్ తొ ఆకట్టుకున్నాడు.

20231020 190003

హీరోయిన్ గా త్రిష మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ తొ ఉన్న ఎమోషనల్ సీన్ లో అయితే జీవించింది.

కీలక పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన హీరో అర్జున్ వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించారు.

మన్సూర్ అలీ ఖాన్ మరియు మిస్కిన్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

20231020 185944

దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన లియో కథాకథనాలను రాసుకోలేకపోయార.

 సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి మూడ్ కి తగ్గట్టుగా బాగుంది.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోకేషన్స్ కనువిందుగా ఉన్నాయి. రెండవ అంకం లో వచ్చే కార్ చేసింగ్ సీన్ అయితే అద్బుతం అని చెప్పవచ్చ.

ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పరిశీలిస్తే అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ట్రిం ట్రిమ్ చేసి ఉండవలసింది. ఫిల్మ్ లుక్ కొన్ని సీన్లు ఫాస్ట్ ఎడిట్ బాగుంది.

నిర్మాతలు S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

20231020 185951

18F మూవీస్ టీం ఒపినియన్:

వరస హిట్ మూవీస్ తొ LCU (Lokesh Cinematic Universe) క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ లియో ఓపెనింగ్ డే నుంచే మూవీ సర్కిల్స్ లో  మంచి బజ్ క్రియేట్ చేశాడు.  భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ లియో చిత్రంలో విజయ్ నటన మరియు యాక్షన్ సీన్స్ , క్లైమాక్స్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి.

ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్  లో ప్రేక్షకుడు సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా  సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు అని చెప్పవచ్చ. వీటికి తోడు రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో కథనం ఎటో వెళ్లిపోయింది అనిపించింది. సంజయ్ దత్, అర్జున్ ల పాత్రలు సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓవరాల్ గా లియో విజయ్ అభిమానులను మాత్రమే ఆకట్టుకుంటుంది. లోకేష్ కథనం ఇంకా బాగా రాసుకొని ఉండవలసింది.

చివరి మాట: లోకేష్ కనకరాజ్ మార్క్ మిస్ !

18F MOVIES RATING: 2.75 / 5

*కృష్ణ ప్రగడ.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *