స్టార్ హీరో దళపతి విజయ్ , లోకేష్ కనకారాజ్ కలిసి చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో థియేటర్ల లో రిలీజ్ అయ్యి అన్ని చోట్లా ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది ఈ లియో సినిమా.
నేటి సాయంత్రం నెహ్రూ ఇండోర్ స్టేడియం లో ఈ లియో (LEO) చిత్ర సక్సెస్ మీట్ జరగనుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. స్టేడియం లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ముఖ్య అతిధి గా ఉలగ నాయకన్ కమల్ హాసన్ అటెండ్ అవ్వుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ కూడా విజయ్ మరియు లోకేష్ స్పీచ్ ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ లియో సినిమా రిలీజైన మొదటి రోజు నుండే చాలా విమర్శలు వచ్చాయి. లియో టీం కూడా చాలా ఇంటర్వ్యూ లలో అనేక అభిప్రాయాలు పంచుకొన్నారు. దర్శకుడు లోకేష్ కూడా లియో-2 ఉంటుంది అని చెప్పారు కానీ ఎప్పుడు అన్నది చేపలేదు.
లియో టీం సభ్యులు అందరూ రియాక్ట్ అయ్యినా, హీరో విజయ్ మాత్రం ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ వేధిక గా దళపతి విజయ్ మాటల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకో కొన్ని గంటలలో తెలిసిపోతుంది. విజయ్ లియో-2 (LEO2) చేస్తున్నారా ? లేదా అనేది మరియు సినిమా మీద వచ్చిన కాంట్రావర్సీల మీద కూడా ఎలా రియాక్ట్ అవుతాడో !
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.