Laxmi Manchu’s Adiparvam Movie Trailer Launch Event Highlight’s: ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టిన ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీస్ “ఆదిపర్వం”

Laxmi Manchus Adiparvam Movie Trailer Launch Event 2 e1710842146949

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ”ఆదిపర్వం”. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు.

Laxmi Manchus Adiparvam Movie Trailer Launch Event 6

తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ ఎన్. గిరిధర్ చేతుల మీదుగా ఆదిపర్వం తెలుగు ట్రైలర్ విడుదలైంది. జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్ రెడ్డి తమిళ ట్రైలర్, ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్, ప్రముఖ రియల్టర్ శిల్పా ప్రతాప్ రెడ్డి మలయాళ ట్రైలర్, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వర్ రావు హిందీ ట్రైలర్ విడుదల చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, బిల్డర్ కైపా ప్రతాప్ రెడ్డి, నటీనటులు ఢిల్లీ రాజేశ్వరి, సత్య ప్రకాష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, జెమినీ సురేష్, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ ఎస్.ఎస్. హరీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అతిధులంతా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Laxmi Manchus Adiparvam Movie Trailer Launch Event

లక్ష్మీ మంచు మాట్లాడుతూ... ”నాకు సంజీవ్ గారు కథ చెప్పినప్పుడు ఇంత పెద్ద సినిమా తక్కువ సమయంలో ఎలా చేస్తారని అనుకున్నా. పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా అనిపిస్తుంది. నవ రసాలు, అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మా దర్శకుడు చాలా స్వీట్ పర్సన్. మా నిర్మాతలు కోరుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుతున్నా” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని మంచు లక్ష్మికి పాదాభివందనం చేయగా… పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు.

Laxmi Manchus Adiparvam Movie Trailer Launch Event 3

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ”మంచు లక్ష్మీ గారి ద్వారా మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారు అని “ఆదిపర్వం” పోస్టర్ చూసి చాలామంది చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అవార్డు వచ్చినంత ఆనందం వేసింది. ఈ మూవీలో మంచు లక్ష్మీ గారి విశ్వరూపం చూస్తాం. ఆదిత్య ఓం గారిని కొత్త పాత్రలో చూస్తారు. ఎస్తర్ గారు కీలక పాత్ర చేశారు. శ్రీజిత ఘోష్ వద్దని 99 మంది చెబితే నేను ఒక్కడినే ఆ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పా. ఆమె 1000 శాతం న్యాయం చేసింది.

శివ కంఠమనేని క్షేత్ర పాలకుడిగా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. లక్ష్మీ మంచు భర్త పాత్రలో జెమిని సురేష్ చక్కని నటన కనబరిచారు. వెంకట్ కిరణ్ థియేటర్ ఆర్టిస్ట్. తను అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సుమారు 400 మంది నటించారు. ఈ సినిమాకు బలం, బలగం మంచు లక్ష్మీ గారు. దాదాపు ఏడు గెటప్స్ వేశారు. దాదాపు 50 అడుగుల ఎత్తులో ఫైట్స్ చేశారు. ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదు. ఈ మూవీకి ఇంత ప్రాముఖ్యం వచ్చేది కాదు. ఇది ఆరంభం మాత్రమే” అని అన్నారు.

Laxmi Manchus Adiparvam Movie Trailer Launch Event 4

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ... “ఆదిపర్వం” ట్రైలర్స్ అదిరిపోయాయి. ఈ సినిమా ఈ రేంజ్ లో వస్తుందని నేను ఊహించలేదు. మంచు లక్ష్మి కెరీర్ లో ఈ చిత్రం ఒక మైల్ స్టోన్ అవుతుందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాబోదు” అన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు:

మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్, ఆర్ట్ : కేవీ రమణ, మ్యూజిక్ : మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్, సాహిత్యం : సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, వూటుకూరి రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా, ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి , ఫైట్స్ : నటరాజ్, కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  , పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్, పి.ఆర్. ఓ : ధీరజ్ – అప్పాజీ, కో డైరెక్టర్ : అక్షయ్ సిరిమళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సహనిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవిదశిక- రవి మొదలవలస- శ్రీరామ్ వేగరాజు, నిర్మాత : ఎమ్. ఎస్ కె., రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *