Lawrence Rudrudu Movie Telugu Review: మాస్ ప్రేక్షకులను మెప్పించే లారెన్స్ రుద్రుడు !

rudrudu రివ్యూ e1681443171509

మువీ: రుద్రుడు  (Rudrudu)

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

నటీనటులు: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్ & ఇతరులు

దర్శకులు : కతిరేసన్

నిర్మాతలు: కతిరేసన్

సంగీత దర్శకులు: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్ ఐ ఎస్ సి

ఎడిటర్: ఆంథోని

రుద్రుడు సినిమా రివ్యూ (Rudrudu Movie Review):

హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయినటువంటి రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన  సినిమా “రుద్రుడు”. మంచి యాక్షన్ డ్రామాగా కతిరేశన్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఈరోజు తమిలం లో రుద్రన్ గా, తెలుగు లో రుద్రుడు గా  ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. మరి ఈ  సినిమా ఎంతమేరకు తెలుగు ప్రేకశకులను  ఆకట్టుకుందో మా 18 f  మూవీ టీం  సమీక్షలో చదివి తెలుసుకుందాం రండి.

rudrudu song

కధ ను పరిశీలిస్తే (story line):

ఇక రుద్రుడు సినిమా  కథలోకి వచ్చినట్టు అయితే..రుద్ర(రాఘవ లారెన్స్) తన అమ్మ నాన్నలు దేవరాజు(నాజర్), ఇంద్రాణి (పూర్ణిమ భాగ్యరాజ్) లతో ఓ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆనాధ అయిన అనన్య (ప్రియా భవాని శంకర్) ని తొలి చూపు లోనే ప్రేమించి, తల్లి దండ్రులను ఒప్పించి  పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ తన తండ్రి నడుపుతున్న బిజినెస్ లో మోసం జరిగి, ఆ ఆర్దిక మోసాన్ని  తట్టుకో లేక రుద్ర తండ్రి చనిపోవడం తో తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుంది.

దీనితో రుద్ర  అప్పులు తీర్చడానికి ట్రావెల్ బిజినెస్ అమ్మేసినా అప్పుతిరకపోవడం తో మిగిలిన ఆప్పు తీర్చుట కోసం తన ఐటి కంపనీ సహాయం తో లండన్ వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక ఆకస్మికంగా తన తల్లి మరణిస్తుంది అలాగే తన భార్య మిస్ అవుతుంది.

తల్లి అంత్య క్రియాలలో పాల్గొనటానికి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత…

రుద్ర భార్య మిస్సింగ్ కేస్ విషయాన్ని ఎలా ఛేజించాడు ?

తల్లిదీ సహజ మరణం కాదు హత్య అని తెలుసుకొని ఏం చేస్తాడు?

ఈ రుద్ర కథ లో  భూమి(శరత్ కుమార్) కి ఉన్న సంబంధం ఏంటి?

విలన్స్ తన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారు ?

 తన భార్య ఏమైంది ? ఎక్కడ ఉంది? 

వంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

rudrudu 6

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

రుద్రుడు సినిమాలో  నిరాశ పరిచే అంశాలు ఏమన్నా ఉంది అంటే అది సినిమా  కథ ని నడిపే కధనమే (స్క్రీన్- ప్లే). కధ రెండవ అంకం లోనే వస్తుంది. మొదటి అంకం (ఫస్టాఫ్) అంతా ఏమి జరుగుతుందో తెలియని గందర గోళంగా  మూడుఫైట్లు నాలుగు సాంగ్స్ తో లాజిక్ లేని సీన్స్ తో కధ మీద ఆసక్తిగా  లేకుండా సాగిపోతుంది. మరో  మాటలో చెప్పాలి అంటే సెకండాఫ్ తో పోలిస్తే ఫస్టాఫ్ ఇలా ఉంది ఏంటి అనే భావన కూడా కలగొచ్చు.

మొదటి అంకం ( ఫస్టాఫ్) లో మరింత ఎమోషన్స్  తో సీన్స్ రాసుకొనే  స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు మాస్ యాక్సన్ మీద దృష్టి పెట్టి బోర్ కొట్టేలా చేశాడు. చాలా వరకు కధ యొక్క కధనాన్ని ( స్క్రీన్ ప్లే) ని ముందే మనం ఊహించవచ్చు.

రుద్రుడు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ రొటీన్ రెగ్యులర్ మాస్ డ్రామా చూసినట్టే అనిపిస్తుంది. అలాగే నటీనటుల్ని కూడా దర్శకుడు అంత స్ట్రాంగ్ గా చూపించలేదు. శరత్ కుమార్ లాంటి సాలిడ్ పర్సనాలిటీ ని ఇంకా మంచి సీన్స్ లో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.

rudrudu 4

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు కథిరేసన్ విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదని చెప్పాలి. సెకండాఫ్ ని  హ్యాండిల్ చేసినట్టు మొదటి అంకం (ఫస్టాఫ్) ని కూడా అదే రీతిలో తెరకెక్కించి ఉంటే బాగుండేది.  అలాగే కథ లో పాయింట్ బాగున్నా  కథనం అంతగా  ఇంప్రెసివ్ గా లేదు. సినిమా  క్లైమాక్స్ ని అయితే సాంగ్ లో ఫైట్ మిక్స్ చేసి బాగా ప్రెసెంట్ చేశారు.

 రాఘవ లారెన్స్ నే ఈ సినిమా కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత వెరే దర్శకుడి దర్శకత్వం లో  రాఘవ లారెన్స్ హీరోగా నటించగా  వచ్చిన ఈ సినిమాలో తన నుంచి ఆశించే అన్ని ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి.

రాఘవ లారెన్స్ తనదైన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. అలాగే తన లుక్స్ గాని సాంగ్స్ లో తన డాన్స్ లు గాని సూపర్బ్ గా అనిపిస్తాయి. ఇక కొన్ని తల్లి సెంటిమెంట్ ఉన్న ఎమోషనల్ సన్నివేశాల్లో లారెన్స్ చూసే ప్రేక్షకులాందరీని  కదిలిస్తాడు. యాక్షన్ సీన్స్  లో కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ తో  లారెన్స్ అలరించాడు.

హీరోయిన్  ప్రియా భవానిశంకర్ లిమిటెడ్ గానే కనిపించినా ఎమోషనల్ ఫీల్ ఉన్న  మంచి పాత్రలో కనిపించింది. తన పాత్ర పరిది మేరకు డీసెంట్ పెర్ఫామెన్స్ తో  ఆకట్టుకుంటుంది.

రుద్రుడు సినిమాలో మరో మంచి హైలైట్ ఏదైనా ఉంది అంటే అది రెండవ అంకం (సెకండాఫ్) అని చెప్పాలి. సినిమాలో సెకండాఫ్ ఆడియెన్స్ లో ఆసక్తి రేపుతూ కధ లోకి తీసుకు వెళ్తుంది.

శరత్ కుమార్ కీలక విలన్ పాత్రలో నటించి మంచి ఆహర్యమ్ తో కనిపించి అద్బుత నటనతో ఆకట్టుకున్నారు అలాగే పలు యాక్షన్ సీన్స్ కూడా లారెన్స్ తో పోటీగా నటించి మెప్పించారు.

rudrudu 5

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

రుద్రుడు సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ కొంతవరకూ బాగానే ఉంది. మ్యూజిక్ వరకూ వస్తే జివి ప్రకాష్ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇంకా  టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ బిజియం వర్క్ ఈ సినిమాలో మాత్రం ఏమంత ఆకట్టుకునేలా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవర్ గా అనిపిస్తుంది.

ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని ఫైట్ సీన్స్ విజువల్ గా బాగున్నాయి.  సాంగ్స్ పిక్సరేజసన్ కూడా కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అలాగే లారెన్స్ కాస్ట్యూమ్స్ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బెటర్ గా చేయాల్సింది. రుద్రుడు సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

rudrudu 56

 

18F మూవీస్ టీం ఒపీనియన్:

లారెన్స్ మాస్టర్ నటించిన  “రుద్రుడు” నుండు సామాన్య మాస్  ప్రేక్షకుడు  ఆశించే కొన్ని ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) కొంచెం హై ఇంటెన్స్ లో సాగినా.. రెండవ అంకం ( సెకండాఫ్) లో అసలు కధ ప్రారంభం అవ్వడం తో ఇంటరెస్ట్ పెరిగి క్లైమాక్స్ కి వచ్చేసరికి కధ కి జస్తీఫికేసన్ వచ్చి పరవాలేదు అనిపిస్తుంది . కానీ రొటీన్ కధనం  తో కూడిన  (స్క్రీన్ ప్లే మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తుంది. దీనితో ఈ రుద్రుడు  సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కాదు కానీ మాస్ ఆడియెన్స్ ని కొంతమేర అలరించవచ్చు.

rudrudu 2

టాగ్ లైన్: రణ గణ ద్వని తో రెచ్చిపోయిన రుద్రుడు 

 

rudrudu 3

18f Movies రేటింగ్: 2.5 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *