Laksh Dheera Movie Nizam & Vizag Rights Acquired by DilRaju : దిల్ రాజు చేతికి లక్ష్ చదలవాడ ‘ధీర’ సినిమా! 

IMG 20240129 WA0159 e1706535335608

టాలీవుడ్ సర్కిల్‌లో దిల్ రాజుకున్న బ్రాండ్ గురించి తెలిసిందే. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది. నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమాను తీసుకున్నాడు. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు తీసుకున్నారు. దీంతో ధీర మీద అందరి దృష్టి మరింతగా పడింది.

IMG 20240129 WA0161

లక్ష్ చదలవాడ ‘ధీర’ అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్న సంగతి తెలిసిందే. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.

IMG 20240129 WA0163

ఆల్రెడీ ధీర గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేశాయి. ధీర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దిల్ రాజు బ్రాండ్ మీద ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఆడియెన్స్‌లోనూ ధీర మీద మరింత ఆసక్తి పెరిగింది.

IMG 20240129 WA0164

నటీనటులు:

లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు…

 

సాంకేతిక బృందం :

సమర్పణ: చదలవాడ బ్రదర్స్ ,బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ,నిర్మాత: పద్మావతి చదలవాడ,సంగీతం: సాయి కార్తీక్,సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ,ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి,ఎడిటర్: వినయ్ రామస్వామి,రచన మరియు దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్,పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *