Laggam  Movie Update: లగ్గం మూవీ టాకీపార్ట్  చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్!

IMG 20240504 WA0084 scaled e1714803823768

“ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అన్నారు పెద్దలు “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి” అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది.

“మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు.

“లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని” రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.

IMG 20240504 WA0083

ఎల్.బి. శ్రీరామ్,రోహిణి, రఘు బాబు గార్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్గా చెప్పారు.

పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే!!! ఒక్కో ప్రాంతంలో ఒక్కోక్క ఆచారం… ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారు.

చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.

నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్,రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల, సంధ్య గంధం, టి. సుగుణ ,ప్రభావతి. కంచరపాలెం రాజు, వివా రెడ్డి,ప్రభాస్ శ్రీను, సదన్న, రవి వర్మ, కిరీటి, రవి ప్రకాష్, బాషా, విజయ లక్ష్మి, తదితరులు.

 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: సుభిషి ఎంటర్టైన్మెంట్స్, కథ – మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రమేశ్ చెప్పాల , నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, కెమెరామెన్: బాల్ రెడ్డి, సంగీతం:చరణ్ అర్జున్,  ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి,  ఆర్ట్: కృష్ణ, సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంజయ్ మహేశ్ వర్మ ,కొరియోగ్రఫీ: బాను,అజయ్ శివశంకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *