Kushi Day1 Collection: బాక్సాఫీస్ దగ్గర ఖుషీ గా దూసుకెళ్తున్న “ఖుషి”.తొలి రోజే 30.1 కోట్లు రాబట్టి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నిలుస్తుంది!

IMG 20230902 WA0039

 

టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఖుషి డే వన్ వసూళ్లు సర్ ప్రైజ్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా వసూళ్లు షో బై షో పెరుగుతూ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. విజయ్ కెరీర్ లో ఇలా తొలి రోజు ఇంత భారీ వసూళ్లు రావడం ఇదే తొలిసారి.

IMG 20230902 WA0012

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇటీవల కాలంలో రాలేదనే ప్రశంసలు ఈ మూవీకి దక్కాయి.

పాజిటివ్ టాక్ రావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు ‌వెళ్తున్నారు. ఉదయం నుంచి షోస్ చూస్తే ఫస్ట్ షో కు ఫ్యామిలీస్ తో ప్రతి చోటా హౌస్ ఫుల్స్ కనిపించాయి. నైజాం ఏరియాతో పాటు వైజాగ్ ఇతర ఏపీ సిటీస్ లో ఖుషికి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

IMG 20230902 WA0025

ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే…మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *