కైకాల సత్యనారాయణ గారి మృతికి కృష్ణంరాజు భార్య శ్యామల సంతాపం

Krishnam Raju wife Shyamala Devi e1671806005720

కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారు అని తెలిసి చాలా బాధ పడ్డాం. ఆయన భార్య కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం.

kaikala satya 2

మొన్నామధ్య కృష్ణంరాజు గారు ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని అంటే ఖచ్చితంగా వస్తానని, మీరు ఒక టైం చూసి చెప్పమన్నారు, అయితే ఆయన మా ఇంటికి రాలేక పోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజు గారితో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారు.

బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు.

kaikala satya

నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది. ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.

satya kcr 2

కైకాల వారి కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *