నటీనటులు: నాగశౌర్య, షెర్లీ సెతియా, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, రాధిక శరత్ కుమార్, బ్రహ్మజీ తదితరులు
దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: మహతి స్వర సాగర్
బ్యానర్: ఐరా క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2022-09-23
కథ, కధనం విషయానికి వెళ్తే :
తూ గో జిల్లా ఆగ్రహారం సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన యువకుడు కృష్ణ చారి (నాగశౌర్య). హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరి తొలిచూపులోనే తన టీం లీడర్ వ్రింద (షెర్లీ సెతియా)ను ప్రేమిస్తాడు. వెస్ట్రన్ కల్చర్ లో పెరిగిన వ్రింద తన ప్రేమను నిరాకరించినా గానీ.. వెంటపడి పెళ్లికి ఒప్పిస్తాడు.
వ్రింద కు పిల్లలు పుట్టరనే విషయాన్ని తన కుటుంబానికి చెప్పి కృష్ణ షాక్ గురిచేస్తాడు. అయితే పెళ్లి తర్వాత వ్రిందాకు ప్రెగ్నెంట్ అవ్వడంతో కృష్ణ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తడంతో కృష్ణ, వ్రిందా విడాకుల వరకు వెళ్తారు. ఇలాంటి ట్విస్టులతో స్టోరీ ముందుకు సాగుతుంది.
తనకు పిల్లలు కలగరనే అబద్దాన్ని కృష్ణ ఎందుకు ఆడాల్సి వచ్చింది?
కృష్ణతో పెళ్లికి వ్రిందా ఎందుకు నిరాకరించింది?
వ్రిందాను పెళ్లికి కృష్ణ ఎలా ఒప్పించాడు?
వ్రిందా విందా ప్రెగ్నెన్సీపై కృష్ణ తల్లి అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఎందుకు అనుమానాలు కలిగాయి?
విడాకుల వరకు వచ్చిన కృష్ణ, విందాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.?
తమ కాపురంలో ఏర్పడిన సమస్యలకు కృష్ణ, వ్రిందా ఎలాంటి పరిష్కారం చూపారు ?
అనే ప్రశ్నలకు హ్యూమర్ మిక్స్ చేసి ఫామిలి అందరినీ నవ్వించి ఆహ్లాద పర్చదమే ఈ వ్రిందా విహారి సినిమా కథ.
దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ విశయం చూస్తే :
దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రాసుకొన్న పాయింట్ బాగుంది. కాకపోతే కథ, కథనాలను విస్తరించే క్రమంలో కొంత తడబాటుకు గురయ్యాడు. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల పరిచయానికి కాస్త సమయం ఎక్కువగానే తీసుకొన్నట్టు అనిపిస్తుంది.
కృష్ణ చారి , వ్రిందా ల మధ్య లవ్ ట్రాక్ చాలా రొటీన్‌గా, ముందే ఊహించే విధంగా ఉండుట వలన కొంచం స్లో గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది .
ఇద్దరి ప్రేమ కథలో వ్రిందా క్యారెక్టర్‌కు సంబంధించిన ఓ ట్విస్టు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. చిన్న ట్విస్టుతో మొదటి అంకాన్ని ముగించి రెండవ అంకం పై మంచి అంచనాలను పంచే ప్రయత్నం చేశాడు అనిల్ కృష్ణ .
ఫస్టాఫ్‌లో కనిపించిన తడబాటు సెకండాఫ్‌లో కనిపించకుండా దర్శకుడు అనీష్ చాలా జాగ్రత్తపడ్డారు. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ బాగా పండటమే కాకుండా కామిడీ ఫుల్లుగా జనరేట్ అయింది.
వెన్నల కిషోర్ ని మంచం మీద పడుకోబెట్టి సినిమా ని లేపే ప్రయత్నం లో డైరెక్టర్ సక్సెస్ ఏయినట్టే. సత్య, వెన్నెల కిషోర్, నాగశౌర్య, రాహుల్ రామకృష్ణ మధ్య కామెడీ ట్రాక్ అదిరిపోతుంది.
వెన్నెల కిషోర్ కోమా ఎపిసొడ్ నవ్వులు పూయించింది. చివర్ల ఆకరిలో సాటి ప్రేకశకులకు అంతకుమించిన క్లైమాక్స్ కథకు లేకపోవడం వల్ల సినిమా స్లో గా రొటీన్‌గా ముగుస్తుంది అని అనిపించవచ్చు .
ఆకట్టుకొన్న హీరో నాగశౌర్య :
నాగశౌర్య మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. సంప్రదాయానికి విలువనిచ్చే బుద్దిమంతుడైన కుర్రాడిగా, లవర్ బాయ్‌గా, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా, తల్లి, భార్య మధ్య నలిగిపోయే భర్తగా పలు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అద్బుతంగా చేశాడు.
సెకండాఫ్‌లో కామిక్ సెన్స్ తో, ఎమోషన్స్ మిక్స్ చేసి నటనతో మెప్పించిన తీరు బాగుంది. పాత్ర కోసం ఆయన కష్టపడిన ప్రతీ విషయం తెరమీద కనిపిస్తుంది.
ఇక వ్రిందగా షెర్లీ తన పాత్ర వరకూ మెప్పిస్తూ స్వంత డబ్బింగ్ తో ఆకట్టుకుంది . కొంచెం భారమైన పాత్రలో మొదటి సారి నటిస్తుంది కాబట్టి పాత్ర లో ఆమె తేలిపోయిందా అనిపిస్తుంది.
కొంత అనుభవం, తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ అయితే.. సినిమా మరింత కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. గ్లామర్ పరంగా పరవాలేదు అనేటట్టు ఉంది కానీ పర్వాలేదు.
టెక్నికల్‌గా ఎలా ఉందో చూద్దాం :
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి బాగుంది. లవ్ ట్రాక్, యాక్షన్ సీన్లను చక్కగా చిత్రీకరించారు.
సంగీత దర్శకుడు మహతి సాగర్ బీజీఎం బాగుంది. ఒక్కపాట తప్ప మిగితా పాటలు ఆకట్టుకొనేలా అనిపించలేదు.
తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది అనేల ఉంది కానీ ఆహ అనేల లేదు.
ఇక ప్రొడ్యూసర్ గురించి చూస్తే. ఫ్యామిలీ చిత్రాలను రూపొందించే నిర్మాతగా ఉషా ముల్పూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇంకా కొంచెం టైమ్ కథ, కధనం పై దృష్టిపెట్టి ఉంటే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయ్యేదనిపిస్తుంది.
ఫైనల్‌గా కృష్ణ వ్రింద విహారి ఎలా ఉందంటే?
లవ్, యూత్‌ఫుల్ ఎలిమింట్స్‌తో ఫన్, ఫ్యామిలీ అంశాలతో రూపొందిన చిత్రం కృష్ణ వ్రిందా విహారి. టైటిల్‌కు తగినట్టే ఫీల్‌గుడ్ మూవీ.
ఫస్టాఫ్ రొటీన్‌గా సాగడం, రొటీన్ కథ, కథనాలు తప్పితే పెద్దగా మైనస్‌లు కనిపించవు. సెకండాఫ్ మంచి హ్యుమర్, వెన్నెల కిషోర్ కామెడీతో సినిమా ఆహ్లాదకరంగా మారింది.
ఫన్, ఫ్యామిలీ చిత్రాలను ఆదరించే వారికి కృష్ణ వ్రిందా విహారి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే హ్యాపీ గా చూడవచ్చు. ఫన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ అంశాలు మంచి అనుభూతిని పంచుతాయి.
18F Opinion: సరదాగా ఫామిలితో నవ్వుల విహారం చేయవచ్చు .
-కృష్ణా ప్రగడ.