Kotta Rangula Prapancham Mlvie Release On : కొత్త రంగుల ప్రపంచం ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్  !

IMG 20240109 WA0074 e1704796953776

 

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కొత్త రంగులు ప్రపంచం. క్రాంతి, శ్రీలు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 20న బ్రహ్మాండంగా విడుదల అవుతుంది. గతంలో రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిచే రిలీజ్ అయిన ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభించింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

IMG 20240109 WA0076

హీరో క్రాంతి మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. నాకు హీరోగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్ గారి కృతజ్ఞతలు అన్నారు.

IMG 20240109 WA0075

హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ : మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గా తెలిసిన నాకు నాన్నగా చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఎంతో ఇష్టమైన పృథ్వీరాజ్ గారు నన్ను హీరోయిన్ గా పెట్టి ఈ సినిమా డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ కి సినిమా ప్లస్ అవుతుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడతారు నాకు పవన్ కళ్యాణ్ గారు రూపంలో కనబడ్డారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

IMG 20240109 WA0073

డైరెక్టర్ పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ : నన్ను ఇన్నాళ్లు ఆర్టిస్ట్ గా ఎంతో ఆదరించారు ఈ సినిమాతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ముందే చెప్పా కొత్త వాళ్ళు కంప్లీట్ గా కొత్త హీరో కొత్త హీరోయిన్ కొత్త డైరెక్టర్ ఇలా అందరం కలిపి ఒక మంచి ప్రోడక్ట్ తో మీ ముందుకు రాబోతున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి కష్టపడి పని చేశారు. నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినా నా టీం కి ఆర్టిస్టులకి కృతజ్ఞతలు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అడిగిన వెంటనే మా ట్రైలర్ లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈనెల 20న సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ప్రేక్షకుల ఆదరణ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

 

నటీనటులు :

హీరో : క్రాంతి, హీరోయిన్ : శ్రీలు,విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : శ్రీ పిఆర్ క్రియేషన్స్, నిర్మాతలు : పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి, దర్శకత్వం : పృథ్వీ రాజ్, కెమెరామెన్ : శివారెడ్డి, పి ఆర్ ఓ : ధీరజ్ – ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *