‘Korameenu’ is a drama-thriller telling a ‘Good Versus Evil’ story: లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా ‘కొరమీను’ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల !

koramenu పోస్టర్

 

జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కొరమీను’ .

ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటీ నటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు.

koramenu poster 1

ఈ “కోరమీను” మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘమృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బొట్స్ కనిపించగా అందులోని ఒక బోట్ పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’…..

అంటూ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్ మరియు పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూసే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

koramenu poster 1 1 e1667073578857

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ..మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ విషయానికి వస్తే జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. .

సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు మరియు వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న “కొరమీను” అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

koramenu పోస్టర్ 1 e1667073630709

నటీ నటులు :
కోటిగా ఆనంద్ రవి
కరుణ పాత్రలో హరీష్ ఉత్తమన్
మీసాల రాజుగా శత్రు
మీనాక్షిగా కిషోర్ ధాత్రక్
దేవుడిగా రాజా రవీంద్ర
సీఐ కృష్ణగా గిరిధర్
ముత్యంగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్
సుజాతగా ఇందు కుసుమ
వీరభద్రంగా ప్రసన్న కుమార్
కరుణకు సహాయకుడిగా ఆర్కే నాయుడు

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీపతి కర్రి
నిర్మాత: పెళ్లకూరు సామాన్య రెడ్డి
ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ఆనంద్ రవి
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర
సంగీతం: అనంత నారాయణన్ AG
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
ప్రొడక్షన్ డిజైనర్: మూసి ఫణి తేజ
స్టైలిస్ట్: పూజా శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జానా స్వామి సౌండ్ డిజైన్: సాయి వర్మ ఉదునూరి
సాహిత్యం: పూర్ణాచారి, లక్ష్మీ ప్రియాంక
గాయకులు: మాస్టర్ వాసుదేవ్ AS, సూరజ్ సంతోష్, పార్వతి AG, నితిన్ రాజ్
PRO: నాయుడు-ఫణి ( బియాండ్ మీడియా )

https://www.youtube.com/watch?v=SvQcrSzJczs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *