మూవీ: కోనసీమ థగ్స్
విడుదల తేదీ : 24-02-2023
నటీనటులు: హృదు హరూన్, బాబీ సింహా, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, పిఎల్ తేనప్పన్
దర్శకురాలు: బృంద
నిర్మాతలు: రియా శిబు, ముంతాస్ ఎం
సంగీత దర్శకులు: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుసామి
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
కోనసీమ థగ్స్ సినిమా రివ్యూ (Konaseema Thugs Movie Review):
డాన్స్ మాస్టర్ బృంద దర్శకత్వంలో హృధు హరూన్ హీరో గా, బాబీ సింహా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “కోనసీమ థగ్స్”. కాగా ఈ చిత్రం శుక్రవారం తెలుగు తమిళం లో విడుదల అయింది.
మరి ఈ కోనసీమ థగ్స్ సినిమా తెలుగు ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ ను పరిశీలిస్తే (story line):
శేషు(హృదు హరూన్) యొక్క తల్లి దండ్రులు చిన్నప్పుడే చనిపోవడం తో అనాధ గా తన తండ్రి పనిచేసిన పెద్ది రెడ్డి దగ్గర గుమాస్తా గా పనిచేస్తుంటాడు. అనుకోని సంగతనల లో శేసు హత్య కేసులో నిందితుడు గా మారి జైలుకి వచ్చిన శేసు కి విచిత్రమైన మనుషులు పరిచయం అవుతారు,
అలాంటి పరీఛాయాలలో కాకినాడ మార్కెట్ కి సంబంధించిన దొర (బాబీ సింహా)తో కలిసి ఒకే గదిలో ఉంటూ జైలు నుండి తప్పించుకొనే ప్లాన్ ఉంది అంటూ తన గదిలో ఉన్న అందరినీ శేషు ప్రోత్సాహిస్తాడు. ఇలా నడుస్తున్న కధ లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శేషు ,దొర, మరికొందర్ని కలుపుకుని, ఆ జైలు నుంచి తప్పించుకోనే ప్రయత్నం ప్రారంభిస్తారు.
ఇలా ఈ ముఠా జైలు నుంచి తప్పించుకోగలిగారా ?,
తప్పించుకొనే ప్రయత్నం ఎలా చేశారు ?
ఈ మధ్యలో తప్పించుకోనే ప్రయత్నం లో పోలీస్ ఏమి చేశారు ?
అసలు శేషు హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు ?
శేషు గత స్టోరీ ఏమిటి ?, చివరకు తప్పించుకుని ఎక్కడికి వెళ్ళారు ?
శేషు అనే కుర్రోడు మంచివడా ? చేద్దావడా ?
అతని లవ్ స్టోరీ ఏమిటి ? దొర ఎలాంటి వాడు ? అనే ప్రశ్నలు మీకు ఆలోచనలు కలిగిస్తూ ఉంటే మీరు తప్పక ఈ కోనసీమ థగ్స్ సినిమా థియేటర్ కి వెళ్ళి చూడవలసిందే.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):
కోనసీమ థగ్స్ సినిమా కధ లో మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా ఉన్నప్పటికీ కధనం (స్క్రీన్ – ప్లే ) లో యాక్షన్ సీన్స్ తప్ప కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో కొన్ని చోట్ల చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకురాలు బృంద కథనాన్ని పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని జైలు లోని కీలకమైన సన్నివేశాలు పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపారు.
కోనసీమ థగ్స్ సినిమా చూస్తున్నంత చాలా సేపు తర్వాత ఏం జరుగుతుంది, శేషు దొర పాత్రలు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతున్నాయి ?, అసలు వాళ్ళు పోలీసులు నుండి ఎలా తప్పించుకుంటారో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంటెన్సివ్ సీన్స్ తో కూడిన కధనం నడిపే అవకాశం ఉన్నప్పటికీ దర్శకురాలు మాత్రం, ఆ దిశగా కధనాన్ని నడపలేదు. ఇక సినిమా మొదటి అంకం ( ఫస్టాఫ్) కథనం ఇంటరెస్ట్ గా గడిచిపోగా రెండవ అంకం (సెకెండ్ హాఫ్) కథనం కొన్ని చోట్ల, మరింత నెమ్మదిగా ఉంటుంది. కానీ ఓవరాల్ గా ఇంటెన్సివ్ గ్రిప్పింగ్ తో సినిమా ముగుస్తుంది.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకురాలు: మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకురాలు బృంద ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆమె రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి
బృందా ఈ సినిమా కోసం మంచి పాయింట్ ఉన్న కధను ఎన్నుకొన్నా జైలుకి వచ్చిన మనుషులు మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, అంటూనే మంచివారు తోటి ఖైదీల మద్యలో ఎలాంటి ఇబ్బందులుకు లోను అయ్యారు ? అనే కోణంలో సాగిన ఈ కోనసీమ థగ్స్ సినిమా కధ బాగానే ఉంది.
ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ సినిమా చూసే ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. అలాగే, పోలీసుల్లో కొంతమంది మంచి పోలీసులు పైఅధికారుల ఒత్తిడికితో ఎలా ప్రవర్తిస్తున్నారు ? వాళ్ళు అమాయకులైన ఖైదీలను ఎలా టార్చర్ పెడతారనే అంశాలు కళ్ళకు కట్టినట్లు దర్శకురాలు బృందా చూపించారు.
కోనసీమ థగ్స్ సినిమాలో నటించిన అందరు నటులు చక్కని సహజమైన నటనతో.. చాలా బాగా నటించారు. వాస్తవిక కథతో పాటు పాత్రల చిత్రీకరణ కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా స్టంట్స్ చాలా బాగా న్యాచురల్ గా ఉన్నాయి. కొందరు ఆవేశంలో చేసిన తప్పు కారణంగా.. ఖైదీలు గా మారి పోలీసుల చేతిలో ఎలా హింసించ బడతారో కూడా చాలా బాగా ఎలివెట్ చేశారు. కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.
థగ్స్ సినిమా లో కీలక పాత్రల్లో నటించిన హృదు హరూన్ చాలా చక్కగా అమాయక కుర్రోడుగా అద్భుతంగా నటించాడు. తనకు ఈ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ, చాలా చక్కని నటనతో స్టంట్స్ ఫెర్ఫర్మ్చేశాడు. హృదు హరూన్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో డాన్స్ లు ఫైట్స్ లో అద్భుతంగా నటించాడు.
హీరో పాత్ర తర్వాత అలాంటి ప్రాముఖ్యత కలిగిన పాత్ర లో బాబీ సింహా కూడా చాలా వైవిధ్యంగా నటించి మెప్పించాడు. బాబీ సింహా కి తప్పక అవార్డు వచ్చే నాటనని ఇచ్చాడు అని చెప్పవచ్చు.
మిగిలిన పాత్రలలో ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని తమ పాత్రల్లో ఒదిగిపోయీ చక్కగా ఎంతో న్యాచురల్ గా చేశారు. . . అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
సంగీత దర్శకుడు సామ్ సిఎస్ సంగీతం బాగుంది. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకురాలు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలు రియా శిబు, ముంతాస్ ఎం లను
అభినందించాలి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
కోనసీమ థగ్స్ అంటూ వచ్చిన ఈ సినిమా లోని కొన్ని అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్,మరియు ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెన్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఐతే, సినిమా కధ బాగున్నా కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు.
కొన్ని జైలు సీన్స్ స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి.
ఓవరాల్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టబడే వారికి, బీసీ సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది .
టాగ్ లైన్: థగ్స్ ఏమోసనల్ జర్నీ
18f Movies రేటింగ్: ౩ .2 5/ 5
* కృష్ణ ప్రగడ.