కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” సినిమా నుంచి ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ !

IMG 20250806 WA0289 e1754490753206

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు ” K-ర్యాంప్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9వ తేదీన ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట కోసం ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంగా సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్ చూపించేలా కలర్ ఫుల్ గా రూపొందించారు.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

టెక్నికల్ టీమ్:

ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి ,యాక్షన్ – పృథ్వీ,, ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్,డీవోపీ – సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్, పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్, కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట , ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు , రచన, దర్శకత్వం – జైన్స్ నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *