50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం “క“ సినిమా !

IMG 20241115 WA01761 e1731673428281

థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకుని థర్డ్ వీక్ ప్రదర్శితమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ “క“ సినిమాకు మంచి వసూళ్లు దక్కాయి.

సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైలా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారని చెప్పేందుకు కిరణ్ అబ్బవరం “క“ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

IMG 20241114 WA0099

ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ “క” సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

“క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా.. ఈ నెల 22న మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఎడిటర్ – శ్రీ వరప్రసాద్, డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్, లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్, సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్), కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల, మేకప్ – కొవ్వాడ రామకృష్ణ, ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్, కొరియోగ్రఫీ – పొలాకి విజయ్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్,వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి, కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి, ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), రచన దర్శకత్వం – సుజీత్, సందీప్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *