కిరణ్ అబ్బవరం హాస్య మూవీస్ ‘K-ర్యాంప్’ ఆరంభం !

IMG 20250203 WA0103 scaled e1738583341592

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆయన కెరీర్‌లోనే ‘క’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తరువాత కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా చేస్తారు? ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు? అన్న కుతుహలం ఆడియెన్స్‌లో పెరిగిపోయింది.

ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది.

IMG 20250203 WA0101

‘సామజవరగమన’, ‘ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత హాస్య మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 7గా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌కి ‘K-ర్యాంప్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ‘K-ర్యాంప్’ సినిమాకు కొత్త డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

సోమవారం జరిగిన ఈ సినిమాకు పూజా కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ పాల్గొన్నారు.

IMG 20250203 WA0105

తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తుంటే నిజంగానే ర్యాంప్ ఆడించేలా ఉన్నారు. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌లా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరంను పూర్తిగా చూపించలేదు గానీ.. చుట్టూ ఆ మందిని చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్టుగానే ఉన్నారు.

టైటిల్ లోగోలో ఉన్న ఆ బొమ్మ, ఆ మందు సీసా, ఆ ఫుట్ బాల్‌ను చూస్తుంటే అందరిలోనూ ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. కథ ఏమై ఉంటుందా? అనే చర్చలు లేవనెత్తేలా ఈ టైటిల్ పోస్టర్‌ ఉంది.

ఈ “k- ర్యాంప్”లో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది . ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సతీష్ రెడ్డి మాసం కెమెరామెన్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్ గా సుధీర్ మాచర్ల, పృథ్వీ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్ : హాస్య మూవీస్, నిర్మాత : రాజేష్ దండ, సహ నిర్మాత : బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు, రచన, దర్శకత్వం : జైన్స్ నాని, సంగీతం : చేతన్ భరద్వాజ్, కెమెరామెన్ : సతీష్ రెడ్డి మాసం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి , ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల , ఎడిటర్ : చోటా కె. ప్రసాద్, యాక్షన్: పృథ్వీ , పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, పీఆర్వో : వంశీ శేఖర్ – జి.ఎస్.కె మీడియా, డిజిటల్ మార్కెటింగ్ : హాష్ టాగ్ మీడియా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *