కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” నుంచి  మరో  లిరికల్ సాంగ్ ! 

IMG 20250301 WA0022 e1740800255717

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా“. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

“దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “దిల్ రూబా” నుంచి మోస్ట్ అవేటెడ్ సాంగ్ ‘కన్నా నీ..’ రిలీజ్ చేశారు.

‘కన్నా నీ..’ పాటను టాలెంటెడ్ మ్యుజీషియన్ సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘కన్నా నీ..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే, అలలుగా తాకగానే, కరిగిపోనా నీలో, ప్రళయమై తాండవిస్తే, అలజడే నాలో ..’ అంటూ గుండె లయనే అక్షరాలుగా మార్చిన లవ్ వైబ్రేషన్ తో సాగుతుందీ పాట.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు..

టెక్నికల్ టీమ్: 

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను, ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్, ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్, సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ – సామ్ సీఎస్, నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ., రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *