కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ !

IMG 20250430 WA02461 scaled e1746029267879

‘కింగ్‌డమ్’ చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది.

కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది.

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది.

“వారు బ్రతకడానికి ప్రేమను నటిస్తారు, కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది.” అనే వాక్యాన్ని నిర్మాతలు జోడించారు. దానిని బట్టి చూస్తే.. ప్రధాన పాత్రలు మొదట ప్రేమలో ఉన్నట్లు నటిస్తాయి, కానీ చివరికి నిజంగానే ప్రేమలో పడిపోతాయని అర్థమవుతోంది.

విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మే 2న విడుదల కానున్న ‘హృదయం లోపల’ గీతం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రోమోలో అనిరుధ్ సంగీతం కట్టిపడేసింది. అలాగే అనిరుధ్, అనుమిత నదేశన్ తమదైన గాత్రంతో మెప్పించారు. ఈ మనోహరమైన గీతానికి కెకె సాహిత్యం అందించారు. దార్ గై తన కొరియోగ్రఫీతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *