సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో చేరిన “కిల్లర్”

IMG 20241208 WA0074 e1733653077159

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన వన్ ఆఫ్ ది హీరోగా నటిస్తుండటం విశేషం.

ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు.

IMG 20241208 WA0073

ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మరో హీరో విశాల్ రాజ్ పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ, మొయినాబాద్ లొకేషన్స్ లో జరిగే ఈ రెండో షెడ్యూల్ లో గౌతమ్ అనే యాక్టర్ తో పాటు జ్యోతి పూర్వజ్ కూడా జాయిన్ కాబోతున్నారు.

నటీనటులు –

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, శివ మాధవ్, గౌతం తదితరులు….

టెక్నికల్ టీమ్: 

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరతన్ , వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), ఎస్క్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాధవ్, బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ., నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.రచన దర్శకత్వం – పూర్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *