కోబలితో మరో విజయం అందుకున్న నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు

IMG 20250206 WA0044 scaled e1738831307852

 ఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన కొబలి వెబ్ సిరీస్ ఈ నెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది

ఏడు భాషల్లో విడుదలైన కోబలి.. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించు కుంటోంది. ఈ సిరీస్ కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోడూరు గ్రామానికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు టిఎస్ఆర్ అనే బ్యానర్ ను స్థాపించి ఇంతకు ముందు ‘తికమకతాండ’అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ఆయన కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తూ నిర్మించిన తికమకతాండ రెండు తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. తర్వాత స్ట్రీమింగ్ పార్టనర్ ఆహాలోనూ ఆకట్టుకుంటోంది.

IMG 20250206 WA0046

మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే కోబలి వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదలైంది. వీటిలో తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ , బెంగాలీ , మరాఠీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోందిప్పుడు.

‘కోబలి’ సిరీస్ లో రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ డ్రాప్ లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ లో ఇలాంటి కంటెంట్ ఇంతకు ముందు చూడలేదు అనేలా యాక్షన్ సీక్వెన్స్ లను రూపొందించారు.

IMG 20250206 WA0043

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రివెంజ్ డ్రామాలోని ఇంటెన్స్ కు ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ తో ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపించిన రవి ప్రకాష్ మెయిన్ లీడ్ కు వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అతని నటన కట్టిపడేస్తుంది.

ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాల్లో రివెంజ్ అనేది కామన్ గానే ఉన్నా.. ఈ సిరీస్ లోని రివెంజ్ కు సంబంధించిన ప్లాట్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు మరింత థ్రిల్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *