విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే ‘యెదకి ఒక గాయం..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
యెదకి ఒక గాయం..వదలమంది ప్రాణం ..చెలిమివిడి బంధం..ఎవరు ఇక సొంతం..కలతపడి హృదయం… కరగమంది మౌనం…గతమువిడి పాశం..ఏది ఇక బంధం అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరపర్చి పాడారు. పాటలోని సాహిత్యం, సంగీతం ఎంతో అందంగా కలిసిపోయిన ఈ పాట వినగానే మ్యూజిక్ లవర్స్ ను ఫేవరేట్ సాంగ్ గా మారిపోవడం ఖాయం.
ఈ పాటలో విజయ్ దేవరకొండ పలికించిన భావోద్వేగాలు కూడా ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ గా ఉండబోతున్నాయి. సినిమాలో ఈ పాట వచ్చే సిచ్యువేషన్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. యెదకి ఒక గాయం పాటకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిక్చరైజ్ చేసినట్లు దర్శకుడు శివ నిర్వాణ చెబుతున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ