Khushi team Visited Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకున్న “ఖుషి” మూవీ టీమ్

IMG 20230903 WA00651

 

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఖుషి మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

IMG 20230903 WA00651 IMG 20230903 WA00661

హీరో విజయ్ దేవరకొండ, ఆయన పేరెంట్స్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా

IMG 20230903 WA00641

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండు సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను.

IMG 20230903 WA0054

కొన్నేండ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఏ ఇబ్బందీ లేకుండా దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు, పోలీసులు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా.

IMG 20230903 WA00631

మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా. అని చెప్పారు.

IMG 20230903 WA0063

ఖుషి దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *