KHUSHI Storm Contenues: బాక్సాఫీస్ కలెక్షన్స్ జోరు కొనసాగిస్తున్న “ఖుషి”, రెండో రోజుకు రూ.51 కోట్ల గ్రాస్ వసూళ్లు !

IMG 20230903 WA0057

 

టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజుకు 51 కోట్ల రూపాయలు ఆర్జించింది.

IMG 20230902 WA0150

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. నైజాం ఏరియాలో రెండో రోజున ఖుషి 3.3 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఖుషికి పెరుగుతున్న బుకింగ్స్ మూడో రోజైన సండే కూడా ఇదే జోరు కొనసాగుతుందని సూచిస్తున్నాయి.

IMG 20230903 WA0054

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.

IMG 20230903 WA0064

మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. రెండో రోజునే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించింది. కలెక్షన్స్ చూస్తుంటే మరికొద్ది రోజుల పాటు ఖుషి జోరు కొనసాగేలా ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *