KHUSHI Trailer launch: ఆగస్టు 9న విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ !

IMG 20230807 WA0035 e1691457029743

 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

100093466

ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటిదాకా ఖుషి నుంచి రిలీజ్ చేసిన లిరికల్ పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు రికార్డ్ వ్యూస్ రాబడుతున్నాయి.

img 20230708 wa0099 720

ఖుషి ట్రైలర్ పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

Kushi 2022 film

టెక్నికల్ టీమ్: 

మేకప్ : బాషా

కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్

ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక

ఫైట్స్ : పీటర్ హెయిన్

రచనా సహకారం : నరేష్ బాబు.పి

పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా

పబ్లిసిటీ : బాబ సాయి

మార్కెటింగ్ : ఫస్ట్ షో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్

మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్

డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్

Kushi Still 9

సి.ఇ.ఓ : చెర్రీ

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి

నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి

కొరియోగ్రఫీ : శివ నిర్వాణ

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *