సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేతిక శర్మ కు ఇన్‌స్టా గ్రామ్ లో 2.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చూసి కేతిక శర్మ కు అల్లు అర్జున్ తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించే అవకాశం కల్పించింది ఆహా ott.
కేతిక శర్మ చదువు పూర్తి కాగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో వివిధ డబ్ స్మాష్ లు, వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది అందాల సుందరి.
కేతిక 2016లో నటించిన థగ్ లైఫ్ అనే వీడియోతో మోస్ట్ పాపులర్ గా మారింది. అలాగే మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తో కుర్రకారు గుండెల్లో నిండిపోయింది.
2021లో పూరీ జగన్నాధ్ కధ తో తెరకెక్కిన రొమాంటిక్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. అక్టోబర్ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. హీరో గా ఆకాశ్ పూరీ నటించాడు .
మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం పర్వాలేదనిపించుకున్నా తన గ్లామర్‌తో మాత్రం యూత్‌ను చాలానే అట్రాక్ట్ చేసింది కేతిక భామ. సాంగ్స్, సీన్స్‌లలో రొమాంటిక్‌గా నటించి కేక పుట్టించింది.
అనంతరం నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో కూడా యాక్ట్ చేసే ఛాన్సే కొట్టేసి తెలుగు ఇండిస్ట్రీ లో పాగా వేసింది. ఈ లక్ష్య సినిమా అంతగా విజయం అందుకోలేకపోయింది. అయినా కేతిక శర్మకు ఉన్న క్రేజ్ మాత్రం తగగేదేలే అన్నట్టు ఉంది.
లక్ష్య తర్వాత వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాతో జోడి కట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన కేతిక శర్మకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటి తాజాగా మరికొన్ని ఫొటోలను వదిలింది. వైట్ కలర్ డ్రెస్ లో హాట్ గా తన నాభి అందాన్ని ప్రదర్శించింది.
అంతేకాకుండా కైపుగా చూస్తూ యూత్ కు మత్తెక్కెంచిస్తోంది ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.