Keedaa Cola Review: తరుణ్ నాయుడు గా మస్తు నవ్వుంచుండు!  Come comidy take! 

InShot 20231103 121202167 e1699007478810

మూవీ: కీదా కోలా (Keedaa Cola)

విడుదల తేదీ : నవంబర్ 03, 2023,నటీనటులు: బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌, విష్ణు, హరికాంత్ తదితరులు

దర్శకుడు : తరుణ్ భాస్కర్

నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్‌

ఎడిటర్: ఉపేంద్ర వర్మ

మూవీ రివ్యూ: కేదా కోలా (Keedaa Cola Review) 

20231103 120346

పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది వంటి మంచి టేస్ట్ ఉన్న సినిమా లు తీసిన తర్వాత ఎందుకో ఏమో కాని దర్శకుడు గా చాలా గాప్ తీసుకోని ఫిల్మ్ ఇండస్ట్రీలో నే ఉన్నాను అంటూ కొన్ని సిన్మా లలో గెస్ట్ గా నటిస్తూ, వాయిస్ ఇస్తూ మూవీ బగ్ గా అందరిలో నేను  డిఫరెంట్ అంటూ కిడ ను కోలా లో పెట్టీ ప్రేక్షకులను నవ్వించడానికి కిడా కోలా క్రైమ్ థ్రిల్లింగ్ గేమ్ అడుండు.

తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ గా ‘కీడా కోలా సైనమా’తో  కమ్.  మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు కిడా కొలా మేప్పించిందో మా 18F మూవీస్ టీమ్  సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

వరదరాజు (బ్రహ్మానందం) తన మనవడు వాస్తవ్  ( చైతన్య రావు)తో జీవితం సాగిస్తూ వుంటాడు. ఐతే, వాసు వ్యక్తిగత ఆరోగ్య, ప్రొఫెషనల్ సమస్యల కారణంగా అతని జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది. ఈ లోపు వాసు స్నేహితుడు అడ్వికేట్ కౌశిక్ (మయూర్ రాగ్)  ఇచ్చిన కీడా కోలా బాటిల్ ఐడియాతో కోట్లలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు.

ఇంతకీ లాయర్ ఇచ్చిన ఐడియా ఏమిటి ?,

దాని కోసం ముగ్గురూ ఏమీ చేశారు ?,

కోలా తో డబ్బులు సంపాదించారా? భాదలా?

మరోవైపు రాజకీయ నాయకుడు గా ఎదగాలి అనుకొంటున్న జీవన్ నీ ఆ ఏరియా కార్పూరేటర్ అవమనిచడం తో బాధపడుతున్న జీవన్ అన్న నాయుడు జైల్ నుంచి రావడం కొసం ఎదురుచూస్తూ వుంటాడు.

నాయుడు (తరుణ్ భాస్కర్) ఇరవై ఏళ్ళు జైలులో గడిపి వస్తాడు. తన తమ్ముడు జీవన్ తో గొడవలు  లేకుండా నిన్ను  కార్పురేటర్ చేస్తాను అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు.

ఇంతకీ నాయుడు చేసిన ప్లాన్ ఏమిటి ?,

ఈ ప్లాన్ కి వాసు – కౌశిక్ ల ఐడియాకి ఉన్న సంబంధం ఏమిటి ?,

నాయుడు మాంచివాడా! చేడ్డవడా?

కార్పురేటర్ అవ్వాలి అన్న జీవన్ కల నెరవేరిందా?

వీళ్ళ కధ లోకి CEO (రవీంద్ర విజయ్), షాట్స్ (రోడీస్ రఘు) ఎందుకు వచ్చారు?

చివరి ఆఖరికి ఈ కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ? అనేది మిగిలిన కథ.

కధనం పరిశీలిస్తే (Screen – Play) : 

20231103 105621

కీడా కోలా సినిమాలో కథా వస్తూ ఆయిన కామెడీ మరియు సస్సెన్స్.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనం (స్క్రీన్ – ప్లే ) పూర్తి ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో కొన్ని సీన్లు  స్లో గా సాగడం, రెండవ అంకం (సెకండాఫ్) లో ఉన్నంత ఫన్, మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో మిస్ అవ్వడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా అనిపిస్తాయి. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కృత్రిమ నటన ఎక్కువవడంతో కథనం లో కొన్ని చోట్ల నట్యూరాల్ ఫ్లో తగ్గిందా అనిపిస్తోంది

ఇంటర్వెల్ సీన్ , క్లైమాక్స్ సన్నివేశాల స్క్రీన్ ప్లే   పై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. సినిమాలో విజువల్స్ టేకింగ్ చాలా బాగున్నా.. కథ చిన్నదిగా ఉండడం, కథనం కూడా రెగ్యులర్ కామెడీ మూవీ లా లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి కొన్ని మైనస్ పాయింట్స్.

ప్రధానంగా ఈ కిడా కోలా చిత్రంలో ప్రస్తావించిన కొన్ని  సీన్లు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. నవ్వించడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి లాజిక్ మాజిక్ లు పక్కన పెడితే కధ, కధనం కొత్తగా హాయిగా నవ్వుకునే లా ఉంది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు తరుణ్ భాస్కర్ మంచి కథాంశంతో పాటు మెసేజ్ ఉన్న కామెడీని,  ఉత్కంఠ భరితమైన సన్నివేశాల తొ బాగా రాసుకున్నాడు. అలాగే, ఇంపర్ట్నెట్  పాత్ర లో నటిస్తూ తెరకెక్కించాడు. అయితే మొదటి అంకం లోని కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఎందుకో  చాలా  తొందరగా ఇంపాక్ట్ లేకుండా ముగించేసాడు అనిపిస్తోంది.

20231103 105711

తరుణ భాస్కర్ పోషించిన  నాయుడు పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు నటనలో పాటూ జీవించారు.

ముఖ్యంగా నాయుడు పాత్ర ఇంగ్లీష్ లొ మాట్లాడడం, ఫేస్ రియాక్షన్స్ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యాయి.

ఇక హీరో చైతన్య రావు చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక వీక్ పర్సన్ గా, మాటలు సరిగా పలకలేని రుగ్మత తో భాధ పడే  అబ్బాయి  గా చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఇరుక్కునే సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు.

 తరుణ్ చైతన్య రావ్ తర్వాత చేప్పుకో తగ్గ పాత్ర అంటే గుండు జీవన్ నే… తమ సీరియస్ యాక్షన్ కామెడీతో ఈ సినిమాకి ప్రాణం పోసాడు. జీవన్, నాయుడు (తరుణ్ భాస్కర్ ) మరియూ శికందర్ (విష్ణు ) డైలాగ్ డిక్షన్ మరియు  ఎమోషన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.

బ్రహ్మానందం కుడా మంచి పాత్రలో కనిపించారు.

రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, విష్ణు, హరికాంత్ తమ పాత్రల్లో జీవించారు.

ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తన టేకింక్ తో తరుణ్ భాస్కర్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల పై మోశాడు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

డిఓపి ఏజే ఆరోన్‌ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కామెడీ అండ్ కీలక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం చాలా బాగుంది. ఎక్కువగా స్లో మోషన్ షాట్స్, బ్యాక్ మూవింగ్ షాట్స్ తో ఇంటరెస్ట్ క్రియేట్ చేసాడు.

IMG 20231102 WA0176

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్లు అయితే BGM తోనే నవ్వువచ్చెలా డిజైన్ చేసారు.  నాయుడు పాత్ర ఫోన్ లో ఎవరినో భూతులు తిడుతుంటే, ఫోర్ గ్రౌండ్ లోని పాత్రలు ఓల్డ్ సాంగ్స్ మ్యూజిక్ ప్లే చేసే ఐడియా అయితే సూపర్ ఆని చెప్పాలి.

ఎడిటర్ ఉపేంద్ర వర్మ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. కొన్ని షాట్స్ మరీ ఫాస్ట్ కట్స్ చేయడం వలన బాగున్నాయి. రిపీట్ షాట్స్ తగ్గించి ఉంటే బాగున్ను.

 నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కాంప్రమైజ్ కాకుండా బాగానే తీశారు.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

క్రైౖమ్‌ కామెడీ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ ‘కీడా కోలా’ కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూ ఈ సినిమా సస్పెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగింది. సినిమాలో కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ ఎంటర్టైనింగ్ సీక్వెన్స్ లు అలరిస్తాయి.

ఫ్రీడమ్ అనేది జేబులో ఉండే డబ్బులో కాదు, జేబు వెనుక ఉండే గుండె లో ఉంటుంది అని చెప్తూ…. కీడా కోలా’ సిన్మా ని కామెడీగా, కొన్ని చోట్ల సస్సెన్స్ కామెడీతో పాటు కొన్ని యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటూ ఇలాంటి మంచి మెసేజ్ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు తరుణ్ భాస్కర

దర్శకుడు గా తరుణ్ భాస్కర్ రాసుకున్నా థ్రిల్లర్ కామిడి సీన్లు అయితే చాలా వ్యూమరస్ గా వున్నాయి.  సినిమా మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) చాలా స్పీడ్ గా నార్మల్ గా అయిపోయినా రెండవ అంకం ( సెకండ్ హాఫ్) లోని కామెడీ సీన్స్ ఆసక్తికరంగా సాగాయి. కానీ, చిన్న పాయింట్ తో రెందు గంటలు కధ గా చెప్పాలి అనుకోవడం సాహసమే,

keedaacola 2

అక్కడక్కడ కథనం ( స్క్రీన్- ప్లే)లో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సిన్మా నీ స్లో నరేసాన్ లో ఉంచాయి. ఐతే, ఈ సినిమా ఓవరాల్ గా హైదరబాద్ సిటీ బ్యాక్మ డ్రాప్ లొ  చేయడం వలన సిటీ యువకులతో పాటూ  కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్ నీ బాగా  ఎట్రాక్ట్ చేస్తుంది. వన్ టైమ్ థియేటర్ లో చూడవచ్చు.

చివరి మాట: కిడ (లాజిక్ ) లేని చల్లని కామిడీ కోలా ..

18F RATING: 3 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *