హైదరాబాదు, సోమాజీగూడాలోని ది పార్క్ హోటల్‌లో ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించారు. భారత సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలను ఈ వేడుకలో అవార్డులతో గౌరవించింది. విద్య, ఆరోగ్య, వ్యాపార, వినూత్నత, సంస్కృతి వంటి విభాగాల్లో ఉత్తమతను ప్రదర్శించినవారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి దక్షిణాది నటి కావ్యా థాపర్, నారీ పురస్కార్ గ్రహీత కె. రాధాదేవి, జియోలాజిస్ట్, సేక్రెడ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. వాసుదేవ్ వీ.ఎన్. అతిథులుగా హాజరై అవార్డులను అందజేసి విజేతలను అభినందించారు.
ఈ సందర్భంగా నటి కావ్యా థాపర్ మాట్లాడుతూ, “ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025లో భాగంగా పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతూ, సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు.

ప్రైడ్ ఇండియా అవార్డ్స్ వ్యవస్థాపకులు వినాయకుమార్ నారాయణస్వామి మాట్లాడుతూ, “ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రారంభించినప్పుడు, వెలుగులోకి రాని గొప్ప వ్యక్తులను గౌరవించాలన్నది మా లక్ష్యం.
ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గొప్ప నాయకత్వాన్ని, మార్పును ప్రతిబింబించే వేదికగా ఎదిగిందని అన్నారు. 120 మందికి అవార్డులను అందజేశామని, హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ 2025 ఎడిషన్ మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందన్నారు.
#KavyaThapar, #IndianIconAwards2025, #PrideIndiaAwards, Ample Reach, Inspirational Leaders, Tollywood, Indian Achievers Awards.