Kavya Raj Mookie Movie Trailer Launch Highlights: మూకీ చిత్రం” కావ్య రాజ్ ” ట్రైలర్ విడుదల !

Kavya Raj Mookie Movie Trailer Launch e1712920247852

గజగౌని ప్రొడక్షన్ పతాకంపై, కవిత రాజ్ పుత్, జమున, అంజలి,మధు, హీరో హీరోయిన్లుగా, మధులింగాల దర్శకత్వంలో, నిర్మాత గజ గౌని దయానంద్ గౌడ్ నిర్మిస్తున్న, యాక్షన్ ఎంటర్టైనర్, “కావ్య రాజ్” . ఈ చిత్రం ఇటీవల “ట్రైలర్ “లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ గారు విచ్చేసి చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు . ఇంకా ఈ కార్యక్రమంలో రావణ లంక హీరో క్రిష్, కోరియో గ్రాఫర్ కట్ల రాజేంద్ర ప్రసాద్, మధుకర్ రెడ్డి, చైల్డ్ ఆర్టిస్ట్ గజగౌని శివాంశ్ గౌడ్ , కంచర్ల లక్ష్మి కాత్యాయిని, శ్రీ భరణి, మల్లికార్జున్ గౌడ్ , పి అర్ ఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Kavya Raj Mookie Movie Trailer Launch1

ఈ సందర్భంగా నిర్మాత దయానంద్ గారు మాట్లాడుతూ”ఈ సినిమా మామూలు సినిమా కాదు. తెలంగాణ మొట్టమొదటి మూకీ చిత్రం. ఈ చిత్రాన్ని పైడి జయరాజు గారికి అంకితం ఇస్తున్నాం. ఎందుకంటే భారత సినీ రంగంలో, తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలంగాణ నటుడు,నిర్మాత, దర్శకుడు,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన సూపర్ స్టార్ మూవీ మొఘల్, అయినటువంటి పైడి జయరాజు గారికి సరైనటువంటి గౌరవం దక్కలేదని నేను చింతిస్తూ, ఈ సినిమాను పైడి జయరాజు గారికి అంకితం ఇస్తున్నాను.

Kavya Raj Mookie Movie Trailer Launch2

దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో. శిఖర సామాన్యుడిగా నిలిచి. తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జయరాజ్ గారిని, ఈ విధంగా సత్కరించుకోవడం అనేది నాకు గర్వకారణం. ఈ విధంగానైనా. పైడి జయరాజు గారు అందరికీ తెలుస్తారని. చిన్న ఆశతో ఈ సినిమాని, తొలి తరం మహానటుడు,మూవీ మొఘల్, పైడి జయరాజు గారికి. అంకితం ఇవ్వడం జరిగింది. అన్నారు.

Kavya Raj Mookie Movie Trailer Launch4

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ” దయానంద్ గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దయానంద్ గారు వాట్సాప్ గౌడ గ్రూపు లో వున్నవారిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈ చిత్రం నిర్మించడం సంతోషదాయకం. చాలా కాలం తర్వాత మంచి మూకీ సినిమా రాబోతుంది. ఈ సినిమానిప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

సాంకేతిక వర్గం : 

ఈ చిత్రానికి కెమెరా ; గిరి,స్టిల్స్ : అనిల్, ఎస్, ఎఫ్ ఎక్స్ : సాల్మన్, ఎడిటర్ : శ్రీనివాస్,నిర్మాత : దయానంద్ గౌడ్ గజ గౌని, పి అర్ ఓ : బాశిoశెట్టి వీరబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *