Karunya shreyans film’s New Movie Opening : కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌ పై కొత్త సినిమా ప్రారంభం !

IMG 20240320 WA0136 e1710940355232

క్రిస్పి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రొడ‌క్ష‌న్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది.

యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు

IMG 20240320 WA0137

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా నిర్మాణంలో నా వంతు బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.

లిరిక్ రైటర్ కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ… సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉంటుంది.

 చిత్ర నిర్మాత పోతురాజు నర్సింహారావు మాట్లాడుతూ.. మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి.

డైరెక్టర్ ఊర శ్రీనివాస్ మాట్లాడుతూ…. మా సస్పెన్స్ triller అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ అవుతుందని అన్నారు…

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ ఆత్రేయ మాట్లాడుతూ.. పాటలు బాగా వచ్చాయి. నాలుగు పాటలు ఉన్నాయి. మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని నమ్మకం ఉంది. సినిమాను సూపర్ హిట్ చేయాలి.

IMG 20240320 WA0138

హీరోలు యస్వంత్, సాయితేజమాట్లాడుతూ …మా తొలి సినిమను ఆదరించాలి.

హీరోయిన్లు ఆరుషి, నిఖిల మాట్లాడుతూ… అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. యూత్ కు నచ్చే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాం.

మాటల రచయిత దాసరి వెంకట్ మాట్లాడుతూ… ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకు ధన్యవాదాలు. ఊపిరి బిగబట్టుకుని చూసే సస్పెన్స్ క్రిస్పీ థ్రిల్లర్ ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.

కథ రచయిత సుస్మా ప్రియదర్శిని మాట్లాడుతూ.. థ్రిల్లర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. అందరిని ఆకట్టుకుని హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.

IMG 20240320 WA0139

 

బ్యానర్ : కారుణ్య శ్రేయాన్స్ ఫిల్మ్స్ 

చిత్రం: ప్రొడక్షన్ నెం 1

ప్రొడ్యూసర్: పోతురాజ్ నర్సింహారావు, కె సాయితేజ, డైరెక్టర్: ఊర శ్రీను, స్టోరీ: కె సుష్మ ప్రియదర్శిని , డైలాగ్స్: దాసరి వెంకటకృష్ణ ,మ్యూజిక్: శ్రీధర్ ఆత్రేయ,లిరిక్స్: కళారత్న బిక్కి కృష్ణ, కెమెరా: జి .అమర్, పీఆర్వో : అశోక్ దయ్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *