కార్తీక్ రాజు ‘విలయ తాండవం’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల! 

IMG 20251225 WA0287 scaled e1766671767934

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం రాబోతోంది. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు

ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా క్రిస్మస్ స్పెషల్‌గా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేట్టుగానే కనిపిస్తుంది. ఈ పోస్టర్‌లో చుట్టూ ఉన్న మంటలు, ఆ మంటల్లో కాలిపోతోన్న వస్తువులు, కింద పడిపోయి ఉన్న ఫోటో ఫ్రేమ్, హీరో చేతి మీద అగ్ని జ్వాలలు, తలకి కట్టు, ఆయన హావభావాలు చూస్తుంటే ఇంటెన్స్ కారెక్టర్‌ను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాల్ని నిర్మాతలు ప్రకటించనున్నారు.

విలయ తాండవం సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్‌గా, జ్ఞాని మ్యూజిక్ డైరెక్టర్‌గా, వంశీ కృష్ణ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు.

తారాగణం :

కార్తీక్ రాజ్, పార్వతి అరుణ్, జగదీష్ (పుష్ప ఫేమ్ కేశవ) తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : GMR మూవీ మేకర్స్, నిర్మాతలు : మండల ధర్మ రావు, గుంపు భాస్కర్ రావు ,  దర్శకుడు : VS వాసు , DOP : సురేష్ రగుతు, సంగీతం : జ్ఞాని , ఎడిటర్ : వంశీ కృష్ణ , ఆర్ట్ డైరెక్టర్ : హరి వర్మ , ఫైట్ మాస్టర్ : వింగ్ చున్ అంజి , డాన్స్ మాస్టర్ : ఆట సందీప్, కపిల్,పోస్టర్లు : అజయ్ (AJ Ads),PRO : సాయి సతీష్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *